Begin typing your search above and press return to search.

40 రోజుల్లో రామాయణ.. ఇప్పుడు కావాల్సింది ఆ ఒక్కటే..

దీనికి తోడు భారతీయ ఇతిహాస కథ. భారీ నిర్మాణం. అంతర్జాతీయ స్థాయి విజువల్స్. ఇవన్నీ రామాయణపై మొదటి నుంచే హైప్ పెంచాయి.

By:  M Prashanth   |   27 Sept 2026 8:16 PM IST
40 రోజుల్లో రామాయణ.. ఇప్పుడు కావాల్సింది ఆ ఒక్కటే..
X

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్.. ఒకే సినిమాలో ఇంతటి స్టార్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు భారతీయ ఇతిహాస కథ. భారీ నిర్మాణం. అంతర్జాతీయ స్థాయి విజువల్స్. ఇవన్నీ రామాయణపై మొదటి నుంచే హైప్ పెంచాయి. కానీ ఇప్పుడు సినిమా ముందు ఉన్న అసలు ఛాలెంజ్ వేరు. అంచనాలను అలాగే ఉంచడం కాకుండా మరింత పెంచడం!

ఒక పెద్ద సినిమా విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో దాని గురించి రోజూ ఏదో ఒక చర్చ ఉండాలి. ముఖ్యంగా రామాయణ లాంటి సినిమాకు ఇది ఇంకా అవసరం. ఎందుకంటే స్టోరీ అందరికీ తెలిసిందే. మరి కొత్తగా ఏం చూపించబోతున్నారనేదే అసలు క్యూరియాసిటీ. అందుకే ఇప్పుడు ఒక్క అదిరిపోయే అప్డేట్ వస్తే పరిస్థితి ఒక్కసారిగా మారొచ్చు. అది కొత్త పాట కావచ్చు. ఒక పవర్‌ ఫుల్ క్యారెక్టర్ గ్లింప్స్ కావచ్చు.

సినిమాలోని భారీ యాక్షన్ వరల్డ్ ను పరిచయం చేసే వీడియో కావచ్చు. ఏదైనా సరే.. ప్రేక్షకుడు ‘ఇది థియేటర్‌ లో చూడాల్సిందే అనుకునేలా ఉండాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు కావాల్సింది మాత్రం మరో స్థాయి ఇంపాక్ట్. సోషల్ మీడియాలో కొన్ని గంటలు ట్రెండ్ అవ్వడం కంటే.. ప్రేక్షకులు ఒకరి నుంచి మరొకరికి సినిమా గురించి మాట్లాడుకునేంత కంటెంట్ అవసరం.

ఇక్కడ రామాయణకు ఉన్న మరో స్త్రెంత్ దాని క్యాస్టింగ్. రణబీర్ కపూర్ రాముడిగా ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి ఒకవైపు ఉంటే.. సాయి పల్లవి సీతగా ఎలా కనిపించనుందనే క్యూరియాసిటీ మరోవైపు ఉంది. ఇక యష్ రావణుడిగా ఎలా ఉంటాడనే ప్రశ్నకు ఇప్పటికే స్పెషల్ క్రేజ్ ఉంది. ఆ ముగ్గురి రోల్స్ కు సంబంధించిన కంటెంట్‌ ను ఒక్కొక్కటిగా బయటకు తీస్తేనే ప్రమోషన్లలో మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఒకేసారి అన్నింటినీ చూపించడం కంటే.. ప్రతి అప్డేట్‌ ను ఒక ఈవెంట్‌ లా మార్చడం సినిమాకు యూజ్ అవ్వొచ్చు. అయితే ఇక్కడ మరో విషయం కూడా మెయిన్. రామాయణ స్టోరీని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలిసిన స్టోరీని స్క్రీన్ పై ఎంత కొత్తగా చూపించబోతున్నారో చూపించాలి. ప్రేక్షకులకు కథ తెలియొచ్చు.. కానీ ఆ వరల్డ్ ఎలా ఉంటుందో తెలియదు. అదే విషయాన్ని ప్రమోషన్స్‌ లో స్ట్రాంగ్ గా చూపించగలిగితే ఆసక్తి పెరగొచ్చు.

ఇంకా నలభై రోజుల సమయం ఉంది. అందుకే ఒక్క స్ట్రాంగ్ అప్డేట్‌ తో సోషల్ మీడియాను షేక్ చేయడం, దాని తర్వాత వరుసగా క్యారెక్టర్లు, పాటలు, మేకింగ్ కంటెంట్‌ తో బజ్‌ ను కొనసాగించడం.. ఇలా ప్లాన్ చేస్తే ప్రతి వారం రామాయణ పేరే వినిపించేలా చేయొచ్చు. భారీ సినిమా కావడం ఒక ఎత్తు.. భారీ సినిమాగా ప్రేక్షకుల మైండ్‌లో నిలవడం మరో ఎత్తు. రామాయణకు ఇప్పుడు కావాల్సింది ఆ ఒక్క బిగ్ మూమెంటే.