Begin typing your search above and press return to search.

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

పదేళ్లుగా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.2,070 కోట్లతో దంగల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ఈ రికార్డును అధిగమించలేదు. తాజాగా ఐదు రోజుల్లో రూ.675 కోట్లు వసూలు చేసిన రామాయణ.. చైనా, ఇతర దేశాల్లో విడుదలకు సిద్ధమవుతోంది. అక్కడ కూడా ఆదరణ దక్కితే దంగల్ రికార్డుకు గండిపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

By:  Ramesh Palla   |   10 Nov 2026 10:05 AM IST
పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?
X

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏడాది వందలాది సినిమాలు వస్తున్నాయి. గడచిన పదేళ్ల కాలంలో వేలాది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హిందీతో పాటు వందల కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ ఇతర భాషల సినిమాలు సైతం ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో విడుదల అవుతూనే ఉన్నాయి. కానీ ఏ ఒక్క భాష మూవీ కూడా పదేళ్ల రికార్డ్‌ ను బ్రేక్ చేయలేక పోతుంది. పదేళ్లుగా ఒక హిందీ సినిమా నెం.1 స్థానంలో ఉంది. ఆ సినిమా రికార్డ్‌ ను మేటి దర్శకులు బ్రేక్ చేయలేక పోతున్నారు, సత్తా ఉన్న స్టార్స్ సైతం ఆ రికార్డ్‌ ను దాటలేక పోతున్నారు. అదే దంగల్‌ రికార్డ్‌. సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలైన దంగల్ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.2070 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా సాధించిన వసూళ్లలో అత్యధిక శాతం చైనా నుంచి రావడం విశేషం. చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమాగానూ దంగల్‌ రికార్డ్‌ పదేళ్లుగా పదిలంగా ఉంది.

బాహుబలి 2 వసూళ్ల రికార్డ్‌..

ఈ పదేళ్ల కాలంలో రెండు మూడు సినిమాలు రెండు వేల కోట్ల మార్క్‌ కి దగ్గరకు వెళ్లినప్పటికీ క్రాస్‌ మాత్రం చేయలేక పోయాయి. బాహుబలి 2 తో పాటు ఒకటి రెండు సినిమాలు దంగల్‌ రికార్డ్‌ను బ్రేక్ చేసే అవకాశం ఉందని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. వెయ్యి కోట్ల మార్క్‌ ను ఈజీగా దాటుతున్న ఇండియన్‌ సినిమాలు రెండు వేల మార్క్‌ ముందు ఆగి పోతున్నాయి. అయితే ఈ పదేళ్ల రికార్డ్‌ ను బ్రేక్‌ చేసేందుకు రామాయణ వచ్చిందని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. విడుదలైన అయిదు రోజుల్లో ఏకంగా రూ.675 కోట్ల వసూళ్లు రాబట్టిన రామాయణ సినిమా ముందు ముందు ప్రపంచ దేశాల్లో విదేశీ భాషల్లో డబ్‌ అయ్యి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్ వర్షన్‌ కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిన కారణంగా విదేశీ భాషల్లో కచ్చితంగా రామాయణ ఆకట్టుకుంటుందని యూనిట్‌ సభ్యులు నమ్ముతున్నారు.

చైనాలో రామాయణ రిలీజ్‌కి ఏర్పాట్లు...

రామాయణ సినిమాను త్వరలో చైనాతో పాటు రష్యా, జపాన్‌ ఇంకా పలు దేశాల్లో ఆయా దేశాల భాషల్లో విడుదల చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హాలీవుడ్‌ రేంజ్‌ వీఎఫ్‌ఎక్స్‌ తో పాటు, అంతర్జాతీయ స్థాయి స్టాండర్డ్‌ తో సినిమాను చేయడం వల్ల రామాయణ సినిమా విదేశీ భాషల్లో దుమ్ము రేపడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. చైనాలో కనుక రామాయణ సినిమాకు మినిమం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా వందల కోట్ల వసూళ్లు నమోదు కావడం ఖాయం. చైనాలో కనుక రామాయణ మూవీ క్లిక్‌ అయితే, అక్కడి ప్రేక్షకుల అభిమానం దక్కించుకుంటే దంగల్‌ రికార్డ్‌ కనిపించకుండా పోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఈ సినిమాకు మంచి స్పందన వస్తే తప్పకుండా రెండు వేల కోట్ల మార్క్‌ ను ఈజీగా క్రాస్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దంగల్‌ ఆల్ టైమ్‌ రికార్డ్‌ బ్రేక్‌..

చైనాలో నాన్‌ ఇంగ్లీష్ కేటగిరీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దంగల్ నిలిచింది. అక్కడ దంగల్‌ రూ.1305 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. అక్కడ విడుదలైన 16వ రోజు ఆదివారం కావడం తో ఏకంగా రూ.113 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు వసూళ్లతో పోల్చితే రెండు వారాల తర్వాత వసూళ్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. అందుకే దంగల్‌ సినిమా రికార్డ్‌ ను ఇప్పటి వరకు ఏ సినిమా బ్రేక్‌ చేయలేక పోయింది. ఇప్పుడు రామాయణ సినిమాను చైనాలో విడుదల చేస్తే తప్పకుండా రికార్డ్‌లు బద్దలు కావడం ఖాయం అనిపిస్తోంది. దంగల్ రికార్డ్‌ బ్రేక్‌ అయ్యే టైం వచ్చిందని, దశాబ్ద కాలంగా నెం.1 స్థానంలో ఉన్న దంగల్‌ ను రామాయణ మూవీ కిందకు నెట్టివేసే అవకాశాలు ఉన్నాయని, వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద రామాయణ మూవీ రూ.2500 కోట్లకు మించి వసూళ్లు చేస్తుందనే విశ్వాసంను బాక్సాఫీస్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చైనాలో ఉన్న దంగల్ రికార్డ్‌ ను సైతం రామాయణ బ్రేక్ చేసే సమయం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.