Begin typing your search above and press return to search.

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

నవంబర్ 5న విడుదలైన రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటించారు. అయితే దర్శకుడు శ్రీరాముడి కంటే రావణుడి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. రావణుడి గతం, శక్తిని ఆసక్తికరంగా చూపించినప్పటికీ, రాముడి వ్యక్తిత్వాన్ని తెరపై సమర్థంగా ఆవిష్కరించలేకపోయారని రామభక్తులు అభిప్రాయపడుతున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   8 Nov 2026 10:24 AM IST
రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?
X

మన అందరికీ మొదటి హీరో ఎవరు అంటే తప్పకుండా గుర్తొచ్చేది ఆ శ్రీరాముడు. ఎన్నో విలువలు కలిగిన వ్యక్తి శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడు పైన సినిమా తీస్తున్నాము అంటే.. ఇక ఎలాంటి ఎలివేషన్స్ సినిమా అయినా పనికిరాదు. అంత చక్కగా ఆయన పాత్రను చూపించవచ్చు. కానీ మన సినిమా దర్శకులు మాత్రం రాముడు కన్నా రావణుడి పాత్ర మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది.

రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు ప్రతి పాత్రను ఎంతో జాగ్రత్తగా చూపించాలి. ముఖ్యంగా శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెరపై చూపించాలి. కానీ ఈ మధ్య విడుదలైన రామాయణం సినిమా చూస్తుంటే దర్శకుడు రాముడి కంటే రావణుడి పాత్రపైనే ఎక్కువ పరిశోధన చేసినట్లు అనిపిస్తోంది.

నవంబర్ 5న విడుదలైన ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటించారు. సినిమా ప్రారంభంలో రావణుడి గతాన్ని చూపిస్తూ కథను ఆసక్తికరంగా మొదలుపెట్టారు. రావణుడు ఎలా చాలా శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు అనే విషయాలను వివరంగా చూపించారు. దాదాపు 40 నిమిషాల తర్వాతే రాముడి పాత్ర కథలోకి వస్తుంది. ఆ 40 నిమిషాలు చాలా ఆసక్తికరంగానే తీశారు దర్శకుడు. రావణుడి పాత్రనే ఇలా చూపించారు అంటే ఇక రాముడి మాత్రమే నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తారు అనే ఉద్దేశం ప్రేక్షకుల మనసులో వస్తుంది.

అయితే రాముడి పాత్ర తెరపైకి వచ్చిన తర్వాత కొన్ని ప్రశ్నలు మొదలవుతాయి. రాముడు, సీత మధ్య వచ్చే కొన్ని సంభాషణలు దగ్గర నుంచి.. శ్రీరాముడి కథను నడిపే తీరువరకు, అసలు దర్శకుడు శ్రీరాముడి గురించి ఏమి తెలుసుకున్నారు అని అనుమానం రాక మానదు. దర్శకుడు తన సృజనాత్మకత పేరుతో కొన్ని విషయాలను మార్చినట్లు కనిపిస్తుంది. రావణుడి పాత్రకి ఇచ్చిన ఎలివేషన్స్ కాస్త రాముడి పాత్రకి ఇవ్వలేకపోయారు.

రెండో భాగంలో కూడా రావణుడు, శూర్పణఖ పాత్రలకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. వారి చుట్టూ వచ్చే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. కానీ రాముడి పాత్ర విషయంలో మాత్రం అదే స్థాయి ఆసక్తి కనిపించదు.

రామాయణం అంటే శ్రీరాముడి గొప్పతనం. ఆయన్ని చూపించే విధానంలో చూపిస్తే.. వందమంది భాషాలు.. వెయ్యి మంది సమరసింహారెడ్డిలు.. లక్షమంది ఇంద్రాలు కూడా దాటేసే అంత ఎలివేషన్తో చూపివ్వచ్చు. కానీ అలాంటి శ్రీరాముడి పాత్ర గురించి సరైన రీసెర్చ్ చేయకుండా మన దర్శకులు ఎందుకు ఇలా తీస్తున్నారు అనేది ఎంతో మంది రామ భక్తుల బాధ.