Begin typing your search above and press return to search.

జక్కన్న రెస్పాన్స్.. ఇది కదా కావాల్సిన బజ్!

సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. అయితే రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమాపై హైప్ పెంచుతున్నాయి.

By:  M Prashanth   |   18 Oct 2026 2:03 PM IST
జక్కన్న రెస్పాన్స్.. ఇది కదా కావాల్సిన బజ్!
X

ఒక భారీ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరగాలంటే ప్రమోషన్స్ ఒక్కటే సరిపోవు. సినిమాలను అద్భుతంగా తెరకెక్కించడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు ఎలా రెస్పాండ్ అవుతున్నారన్నది కూడా ముఖ్యమే. ఇప్పుడు రామాయణ సినిమాకు అలాంటి రెస్పాన్సే వచ్చింది. రణబీర్ కపూర్, సాయిపల్లవి, యష్ నటిస్తున్న ఆ సినిమా ట్రైలర్‌ పై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రీసెంట్ గా ప్రశంసలు కురిపించారు.

రాజమౌళి సోషల్ మీడియాలో రామాయణ ట్రైలర్‌ ను ప్రస్తావిస్తూ మూవీ టీమ్ కు విషెస్ చెప్పారు. రామాయణం అనేది ప్రతి ఇండియన్ డైరెక్టర్ ఎప్పుడో ఒకసారి చెప్పాలని కోరుకునే కథ అని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప ఇతిహాసాన్ని దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ రేంజ్ లో సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు.

సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. అయితే రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమాపై హైప్ పెంచుతున్నాయి. ఎందుకంటే భారీ కథలను సిల్వర్ స్క్రీన్ పై చూపించడంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారతీయ సినిమాలను ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను దగ్గర చేసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

అలాంటి రాజమౌళి.. మరో భారీ చిత్రాన్ని ప్రశంసించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రామాయణం లాంటి ఇతిహాసాన్ని సినిమాగా చూపించడం అంత ఈజీ విషయం కాదు. కథ అందరికీ తెలిసిందే అయినా, దాన్ని కొత్త జెనరేషన్ కు నచ్చేలా చూపించడం పెద్ద సవాలు. రోల్స్, వాటి మధ్య ఫీలింగ్స్, స్టోరీలోని మెయిన్ సీన్స్.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రేక్షకుల అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ట్రైలర్‌ పై రాజమౌళి రెస్పాన్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. అయితే ట్రైలర్ చూసి ప్రశంసలు అందుకోవడం ఒక ఎత్తయితే.. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులను మెప్పించడం మరో ఎత్తు. జక్కన్న ప్రశంసలతో అంచనాలు పెరిగినా, వాటిని సినిమా ఎంతవరకు అందుకుంటుందన్నదే అసలు విషయం. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు.

సన్నీ డియోల్, అమితాబ్ బచ్చన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ నిర్మాణంతో రూపొందుతున్న ఆ సినిమాను నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మూవీపై హైప్ ఉండగా.. ఇప్పుడు రాజమౌళి ప్రశంసలు కూడా తోడవడంతో సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఒక ఇతిహాసాన్ని ఎంత గొప్పగా చూపించారన్నది స్క్రీన్ పై చూస్తేనే తెలుస్తుంది. కానీ, విడుదలకు ముందే జక్కన్న నుంచి ప్రశంసలు రావడం కావాల్సిన బజ్ ను తీసుకొచ్చిందనే చెప్పాలి.