రామాయణ్.. ఆ ఒక్క పాట కోసం..!
రామాయణ్ సినిమాలో రాముడు వనవాసానికి వెళ్లే సందర్భాన్ని చెప్పే పాటను రాయడానికి మా టీంకు వారం రోజులు పట్టిందని అన్నారు కుమార్ విశ్వాస్.
By: Ramesh Boddu | 9 Oct 2025 6:00 PM ISTహృతిక్ రోషన్, యష్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తూ నితీష్ తివారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా రామాయణ్. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో భారీ సెటప్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాను మూడు నాలుగు భాగాలుగా వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తారని ఇప్పటికే ముంబై మీడియా చెబుతుంది. ఐతే రామాయణ్ సినిమాలోని ఒక సాంగ్ గురించి ఆ సినిమాకు ముఖ్యంగా ఆ పాటకు లిరిసిస్ట్ గా చేసిన కుమార్ విశ్వాస్ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. హిందీ పొయెట్, పొలిటీషియన్ అయిన కుమార్ విశ్వాస్ రామాయణంలో ఒక సాంగ్ రాసేందుకు వారం రోజులు టైం పట్టిందని అన్నారు.
రాముడు వనవాసానికి వెళ్లే సందర్భాన్ని..
రామాయణ్ సినిమాలో రాముడు వనవాసానికి వెళ్లే సందర్భాన్ని చెప్పే పాటను రాయడానికి మా టీంకు వారం రోజులు పట్టిందని అన్నారు కుమార్ విశ్వాస్. అంతేకాదు పాట పూర్తయ్యే టైం కి ఏ.ఆర్ రెహమాన్, మరో కంపోజర్ హాన్స్ జిమ్మర్ తో పాటు తనకు కూడా కన్నీళ్లు ఆగలేదని అన్నారు కుమార్ విశ్వాస్. రామాయణ ఇతిహాసాన్ని తీసుకుని చాలామంది ఇప్పటికే సినిమాలుగా తెరకెక్కించారు. కానీ నితీష్ తివారి ఈ సినిమాను మరింత స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు.
ఈమధ్య ఇండియన్ బాక్సాఫీస్ పై మైథాలజీ టచ్ ఇస్తూ చాలా సినిమాలు వస్తున్నాయి. ఐతే ఏదో ఒక నేపథ్యం తీసుకుని దాన్ని పురాణ కథలకు మ్యాచ్ చేస్తున్నారు తప్ప పూర్తిగా ఆ కథ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అందుకే ఈ రామాయణ సినిమాను చాలా ప్రత్యేకంగా చేస్తున్నారట. హృతిక్ రోషన్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు.
సౌత్ లో కూడా ఈ సినిమా మంచి క్రేజ్..
రావణుడిగా కె.జి.ఎఫ్ స్టార్ యష్ నటిస్తున్నారు. హిందీతో పాటు సౌత్ లో కూడా ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకునేలా చేస్తుందని అంటున్నారు. హృతిక్ రోషన్ యానిమల్ తో సూపర్ హిట్ అందుకోగా నెక్స్ట్ రామాయణ్ తో పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
రామాయణ్ సాంగ్ కోసమే అంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు అంటే కచ్చితంగా సినిమాను ఆడియన్స్ కి చేరవేసేందుకు పూర్తిస్థాయిలో కృషి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాను రెండు మూడు భాగాలుగా చెప్పబోతున్న నితీష్ భారీ ప్లానింగ్ తోనే వస్తున్నారని తెలుస్తుంది. సినిమా రిలీజ్ కు ముందే మ్యూజిక్ తోనే రామాయణ్ సినిమాకు ఒక మంచి అప్పీల్ వచ్చేలా ఏ.ఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి పనిచేస్తున్నారు.
