Begin typing your search above and press return to search.

ఆశ్చర్యపరుస్తున్న రామాయణ నటీనటుల రెమ్యూనరేషన్.. మరి మ్యూజిక్ డైరెక్టర్ సంగతేంటి?

మరి నటీనటులకు , సంగీత దర్శకులకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

By:  Madhu Reddy   |   4 April 2026 10:35 AM IST
ఆశ్చర్యపరుస్తున్న రామాయణ నటీనటుల రెమ్యూనరేషన్.. మరి మ్యూజిక్ డైరెక్టర్ సంగతేంటి?
X

ప్రస్తుతం ఎక్కడ చూసినా పౌరాణిక చిత్రం రామాయణ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ పౌరాణిక చిత్రం భారతీయ వెండితెరపై అత్యంత ఖరీదైన ప్రయోగంగా నిలవనుంది.. మార్కెటింగ్ , గ్రాఫిక్స్, సంగీత దర్శకుల కోసం పెడుతున్న వేలకోట్ల పెట్టుబడి అందరిని ఆశ్చర్యపరుస్తోంది.. ఇక ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రెండు భాగాలుగా రాబోతున్న ఈ రామాయణ సినిమాకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే సినిమా కోసం ఇంత ఖర్చు పెడుతుంటే.. మరి నటీనటులకు , సంగీత దర్శకులకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆశ్చర్యపరిస్తున్న నటీనటుల రెమ్యూనరేషన్..

ఇకపోతే మొదటి భాగంలో ఉన్న నటీనటులని రెండవ భాగంలో కూడా కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఆ నటీనటులకు రెట్టింపు స్థాయిలో రెమ్యూనరేషన్ లభిస్తోంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమాలో రాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి రూ.75 కోట్ల చొప్పున రెండు భాగాలకు కలిపి ఈయన 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రావణాసురుడు పాత్ర పోషిస్తున్న కన్నడ హీరో యశ్ రూ.50 కోట్లు తీసుకుంటుండగా.. రెండు భాగాలకు కలిపి 100 కోట్లు తీసుకుంటున్నారు. ఇంకా ఇందులో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి ఒక్కో భాగానికి ఆరు కోట్లు అంటే రెండు భాగాలకు కలిపి 12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

మొదటి భాగానికి మిగతా నటీనటుల రెమ్యూనరేషన్..

రాముడు, సీత, రావణాసురుడు మినహా మిగతా పాత్రలు పోషిస్తున్న వారికి ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే విషయానికి వస్తే.. లక్ష్మణ పాత్ర పోషిస్తున్న రవి దుబే 4 కోట్లు, హనుమాన్ పాత్ర పోషిస్తున్న సన్నీ డియోల్ 20 కోట్లు, మండోదరి పాత్ర పోషిస్తున్న కాజల్ అగర్వాల్ 1 కోటి, సూర్పనఖ పాత్ర పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ 1.5 కోట్లు, కౌసల్య పాత్ర పోషిస్తున్న ఇందిరా కృష్ణన్ 65 లక్షలు, దశరథ పాత్ర పోషిస్తున్న అరుణ్ గోవింద్ 90 లక్షలు, కైకేయి పాత్ర పోషిస్తున్న లారా దత్త 25 లక్షలు. కైకాసి పాత్ర పోషిస్తున్న శోభన 20 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగతేంటి?

ఇకపోతే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్న నేపథ్యంలో అటు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఎంత తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ఏకంగా 30 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట.అంతేకాదు సినిమాకి వచ్చే లాభాలలో కూడా ఆయనకు వాటా ఉండబోతుందని సమాచారం. మొత్తానికి అయితే ఒక్కో భాగానికి 30 కోట్లు అంటే రెండు భాగాలకు కలిపి ఏకంగా 60 కోట్లు అలాగే అదనంగా లాభాల్లో వాటా అందుకోబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రామాయణ కోసం ఏ ఆర్ రెహమాన్ భారీగానే పారితోషకాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది.