Begin typing your search above and press return to search.

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

‘రామాయణం’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ వస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు చెబుతుండగా, భావోద్వేగాలు, దైవిక అనుభూతి ఆశించిన స్థాయిలో లేవనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌లో డబ్బింగ్ సినిమా అనే భావన రాకపోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలుగు డైలాగులకు ఆర్టిస్టుల పెదవుల కదలికలు అద్భుతంగా సరిపోవడంతో, ఇందుకు ఏఐ లేదా ప్రత్యేక విజువల్ టెక్నాలజీ వాడారా అనే చర్చ మొదలైంది. ఇది నిజమైతే భారతీయ డబ్బింగ్ సినిమాల రూపురేఖలనే మార్చే అవకాశం ఉంది.

By:  Garuda Media   |   6 Nov 2026 2:49 PM IST
రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?
X

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘రామాయణం’ సినిమా. కొన్ని రోజుల ముందే ఈ సినిమాకు యుఎస్‌లో ప్రిమియర్స్ వేశారు. ఇండియాలో కూడా నిన్న కొన్ని నగరాల్లో ప్రిమియర్లు పడ్డాయి. ఐతే వాటి నుంచి కొన్ని ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కొన్ని మిక్స్డ్‌గా వచ్చాయి. ఐతే ఈ రోజు ఉదయం సినిమా రెగ్యులర్ షోలు మొదలయ్యాక ఫుల్ లెంత్ రివ్యూలు వచ్చాయి. వాటిలో దాదాపుగా అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి.

ఇదొక విజువల్ వండర్ అనే విషయంలో సందేహమే లేదన్నది ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. కాకపోతే భావోద్వేగాలు అనుకున్న స్థాయిలో పండలేదని, రామాయణ గాథలో ఉన్న డివైన్ ఫీలింగ్ ఈ సినిమాలో తీసుకురాలేకపోయారని ఎక్కువమంది కామెంట్ చేస్తున్నారు. అయినా సరే.. ఒకసారి బిగ్ స్క్రీన్లో చూడ్డానికి ఏమాత్రం ఢోకా లేని సినిమా ఇదనడంలో సందేహం లేదు. టీం పెట్టి ఖర్చు, ఎఫర్ట్ అంతా తెర మీద కనిపించింది. అందుకే ఎక్కువగా పాజిటివ్ టాక్, రివ్యూలే కనిపిస్తున్నాయి.

ఇక ‘రామాయణం’ తెలుగు వెర్షన్ విషయానికి వస్తే ఇందులో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. సినిమా ఎక్కడా కూడా డబ్బింగ్ అనే భావన రాలేదు. బేసిగ్గా ఇది హిందీ సినిమా అయినప్పటికీ.. తెలుగు మాటలు చక్కగా కుదిరాయి. మక్కీకి మక్కీ అనువదించకుండా, చక్కటి తెలుగు పదాలతో మాటలు రాశారు రంగమార్తాండ, కన్నప్ప ఆకెళ్ళ శివప్రసాద్. ఐతే ఇలా మాటలు రాయడం ఒకెత్తయితే.. లిప్ సింక్ చాలా బాగా కుదరడం మరో ఎత్తు. ఈ విషయంలో ఎలా మేనేజ్ చేశారన్నదేే అర్థం కాని విషయం. ప్రతి తెలుగు పదానికీ సరిగ్గా సరిపోయేలా లింప్ సింక్ ఇచ్చారు ఆర్టిస్టులు.

సినిమాలో అందరూ హిందీ ఆర్టిస్టులే ఉండగా.. వాళ్లు ప్రత్యేకంగా తెలుగు డైలాగులను పలికి ఉంటారని అనుకోలేం. ఇలా వేర్వేరు భాషల్లో సినిమా తీయడం అంటే సాధ్యం కాని విషయం. మరి ప్రతి పదానికీ సరిగ్గా సరిపోయేలా ఇలా లిప్ సింక్ ఎలా సాధ్యమైంది అన్నది డౌటు. బహుశా ఇందుకు విజువల్ ఎఫెక్ట్స్ లేదా ఏఐ సాయం తీసుకుని ఉంటారనిపిస్తోంది. దీని కోసం ఏ టెక్నాలజీ వాడారో కానీ.. ఇండియన్ సినిమాలో ఇదొక రెవల్యూషన్ అయ్యే అవకాశముంది. ఇక ముందు ఆ సాంకేతికతను అనువాదాలకు వాడితే.. డబ్బింగ్ సినిమా చూస్తున్న భావనే రాకుండా.. ఆ భాషలోనే సినిమా తీసిన ఫీలింగ్ కలిగి ప్రేక్షకులకు మంచి అనుభూతి కలగొచ్చు. దీని గురించి ‘రామాయణం’ టీం ఏం చెబుతుందో చూడాలి.