బాబోయ్, 9 రోజులు ఉండగానే రూ.20 కోట్లు...!
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
By: Ramesh Palla | 27 Oct 2026 8:03 PM ISTప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ మూవీ 'రామాయణం'. నితేష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 5, 2026న మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఏ ఇండియన్ మూవీ విడుదల కాని రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఏకంగా హాలీవుడ్ సినిమాల విడుదలను సైతం రామాయణం ప్రభావితం చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇండియన్ సినీ ప్రేమికులు మొత్తం రామాయణం సినిమాను చూసేందుకు ఎదురు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే విడుదలకు ఇంకా 9 రోజులు ఉండగానే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోంది. విడుదలకు ముందు ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని ప్రీ సేల్ ఈ సినిమాకు నమోదు కావడం ఖాయం అని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.
రామాయణ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్...
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ వర్గాలు, జాతీయ మీడియా కథనాల అనుసారంగా రామాయణం సినిమా రెండు పార్ట్‌ల కోసం మేకర్స్ ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో ఏ సినిమాకు ఈ స్థాయి బడ్జెట్ ఖర్చు చేయలేదు. కనుక ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.10 వేల కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అనే ధీమాతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే మెల్ల మెల్లగా జోరు మొదలవుతుంది. బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టిన చోట్ల మంచి స్పందన దక్కించుకుందట. విదేశాల్లో ఇప్పటికే ఈ సినిమా ఏకంగా రెండు మిలియన్ డాలర్లను రాబట్టిందట. విడుదలకు ఇంత సమయం ఉండగానే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం మరే సినిమాకు సాధ్యం కాలేదు.
నితేష్ తివారీ దర్శకత్వంలో...
రామాయణ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో విడుదలకు ఇంకా 9 రోజుల సమయం ఉండగానే ఏకంగా రూ.20 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్ది కచ్చితంగా ఈ మొత్తం కచ్చితంగా రూ.200 కోట్ల మార్క్ కు చేరే అవకాశం ఉంది. రామాయణ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో విడుదలకు ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.200 కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అని నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రీ సేల్ ద్వారా రూ.500 కోట్ల నెంబర్ ను టచ్ చేసినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కేవలం హిందీలో మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం కోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అతి త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాబోతుంది.
రణబీర్ కపూర్, సాయి పల్లవి...
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాముడి పాత్రను బాలీవుడ్ రాక్ స్టార్, స్టార్ హీరో రణబీర్ కపూర్ పోషించగా, సీతదేవి పాత్రను సాయి పల్లవి పోషించిన విషయం తెల్సిందే. ఇక అత్యంత కీలకమైన రావణాసురుడు పాత్రను కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యశ్ పోషించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. వీరే కాకుండా సినిమాలోని ప్రతి పాత్రలో స్టార్ నటీనటులు కనిపించబోతున్నారు. రావణాసురుడి భార్య మండోదరి పాత్రను స్టార్ హీరోయిన్ కాజల్ తో చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మొత్తం స్టార్స్ కనిపించబోతున్నట్ల చెబుతున్నారు. సినిమాలో వీఎఫ్ఎక్స్ తో పాటు, ప్రతి ఎలిమెంట్ అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ దీపావళికి మొదటి పార్ట్ రానుండగా వచ్చే దీపావళికి రామాయణ 2 రాబోతుంది. మొదటి పార్ట్ కు వచ్చే రెస్పాన్స్ ను బట్టి మూడో పార్ట్ ఉంటుందా లేదా అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
