Begin typing your search above and press return to search.

రామాయ‌ణం పై బాలీవుడ్ స్టార్స్ సైలెన్స్!

'రామాయణం' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్ల వసూళ్లు సాధించినా బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే చర్చ జరుగుతోంది. హీరోల మధ్య పోటీ, బాక్సాఫీస్ అభద్రత, పౌరాణిక చిత్రాలపై వివాదాల భయం వంటి కారణాలతో పలువురు సెలబ్రిటీలు మౌనంగా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ దక్షిణాది చిత్రాల విజయాలపై బాలీవుడ్ స్పందన పరిమితంగానే ఉందనే చర్చ ఉంది.

By:  Srikanth Kontham   |   10 Nov 2026 11:31 AM IST
రామాయ‌ణం పై బాలీవుడ్ స్టార్స్ సైలెన్స్!
X

ఇటీవ‌లే నితీష్ తివారీ తెర‌కెక్కించిన `రామాయ‌ణం` మొద‌టి భాగం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు తొలి షోతోనే మంచి టాక్ వ‌చ్చింది. రామాయ‌ణంలో ప్ర‌తీ పాత్ర ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో క‌నెక్ట్ అవుతుంది.ఇండియా వైడ్ రామాయ‌ణం దూకుడు కొన‌సాగిస్తుంది. ఇప్ప‌టికే బాక్సాఫీస్ వ‌ద్ద 600 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది.అయితే అంతటి విజయాన్ని సాధించినా? బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి సినిమాకి ఆశించిన స్థాయిలో మ‌ద్దతు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సైలెన్స్ కి కార‌ణాలు ఏంటి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో కొన్ని రీజ‌న్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి.

హీరోల మ‌ధ్య అంత‌ర్గ‌త పోటీ..బాక్సాఫీస్ అభద్రతా భావం హైలైట్ అవుతుంది. సాధారణంగా బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో ఓ పెద్ద ప్రాజెక్ట్ తెరపైకి వ‌చ్చి అది పాన్-ఇండియా లో సక్సెస్ అయితే ఆ విజ‌యం మిగతా స్టార్ల దృష్టిలో స‌వాల్ గా మారుతుంది. పైకి చెప్ప‌కపోయినా? ఎంత మంది హీరోలు ఆ విజ‌యాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటారు? ఎంత మంది జెల‌సీ భావంతో ఉంటారు? అన్న‌ది అంచ‌న వేయ‌డం క‌ష్టం. కానీ చెప్పుకోలేని స‌న్నివేశం అయితే ఎదుర‌వుతుంది. అలాగే రామాయ‌ణం లాంటి క‌థ‌ల‌ను తెరకెక్కించే సమయంలో చిన్న పొరపాటు జరిగినా? అది పెద్ద ఎత్తున వివాదాలకు దారి తీస్తాయి.

గతంలో వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాలు ఎదుర్కొన్న ట్రోలింగ్, ఆడియన్స్ నుంచి వచ్చిన మిశ్రమ స్పందనల దృష్టిలో ఉంచుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అది తమకు అనవసరమైన చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని పలువురు సెలబ్రిటీలు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. పైకి స్పందించాల‌ని ఉన్నా? త‌మ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని బ‌య‌ట‌కి చెప్పుకోలేని స‌న్నివేశాలుంటాయన్నది అంతే నిజం. వీట‌న్నింటిని మించి ఇలాంటి వైఖ‌రితో బాలీవుడ్ వ్య‌వ‌హ‌రించ‌డం కొత్తేం కాదు.

గ‌తంలో ప‌లు ద‌క్షిణాది సినిమాలు హిందీలో సత్తా చాటినా? వాటి గురించి అమీర్ ఖాన్, అమితాచ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు త‌ప్ప చాలా మంది స్పందిం చ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. అలాగే ఈ క‌థ పూర్తిగా హిందు మ‌తానికి సంబంధించింది. ఈ త‌ర‌హా చిత్రాల‌పై బాలీవుడ్ నోరు కుట్టేసికున్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం కొత్తేం కాదు. గ‌తంలో `ఛావా`, `ప‌ద్మావ‌త్` లాంటి సినిమాలు విజ‌యం సాధించిన‌ప్పుడు బాలీవుడ్ ఇంతే మౌనం వ‌హించింది.