Begin typing your search above and press return to search.

రామాయ‌ణం: 'జైజై రామ్' ప్ర‌జ‌ల‌కు నెవ్వ‌ర్ బిఫోర్ విజువ‌ల్ ఫీస్ట్

రణబీర్ కపూర్ -య‌ష్‌- నితీష్ తివారీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం `రామాయణం`పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   14 Sept 2026 5:39 PM IST
రామాయ‌ణం: జైజై రామ్ ప్ర‌జ‌ల‌కు నెవ్వ‌ర్ బిఫోర్ విజువ‌ల్ ఫీస్ట్
X

రణబీర్ కపూర్ -య‌ష్‌- నితీష్ తివారీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం `రామాయణం`పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది దీపావ‌ళికి మొద‌టి భాగం రామాయ‌ణం స్పెష‌ల్ ట్రీట్ ఇవ్వ‌నుంది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్-డిఎన్‌ఈజి - మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ దృశ్యకావ్యంపై ఇప్పటికే విడుదలైన విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా మేకింగ్ - గ్రాఫిక్స్ విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న విధానం ప్రేక్షకులలో క్యూరియాసిటీని మరింత పెంచింది.

వినాయక చవితి పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమాలోని మొట్టమొదటి సింగిల్ `జై జై రామ్` పాటను విడుదల చేసింది. ఈ భక్తి గీతం విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో రికార్డు స్థాయి స్పందనను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది. రామాయణ మహాకావ్యంలోని అత్యంత కీలకమైన ఘట్టాలను కళ్లకు కట్టేలా ఈ పాటను రూపొందించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.

ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక గీతానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ తన మ్యూజిక్‌తో ప్రాణం పోయ‌గా.. ప్రముఖ కవి డాక్టర్ కుమార విశ్వాస్ అందించిన అర్థవంతమైన సాహిత్యం పాటకు మరింత డెప్త్‌ను తెచ్చిపెట్టింది. ఇక అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషల్ తమ అద్భుతమైన గాత్రంతో శ్రోతలను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. ఈ ముగ్గురి క‌ల‌యిక‌లో వచ్చిన ఈ పాట ఒక దివ్యమైన మ్యూజిక‌ల్ ఫీస్ట్ గా మారింది.

పాటలోని విజువల్స్ పరంగానూ మేకర్స్ ఎక్కడా రాజీపడలేదని ప్రతి ఫ్రేమ్ స్పష్టం చేస్తోంది. సీతా స్వయంవరం.. రాముడు-సీతల వివాహం.. వనవాస ప్రయాణం .. తిరిగి అయోధ్యకు రావడం వంటి ప్రధాన ఘట్టాలను అద్భుతమైన గ్రాఫిక్స్, టాప్-క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో చూపించారు. ముఖ్యంగా శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవిల మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ పాట‌లో శ్రీ‌రాముడిగా ర‌ణ‌బీర్.. సీతాదేవిగా సాయిప‌ల్ల‌వి అభిన‌యం ఆక‌ట్టుకుంటున్నాయి. ఇత‌ర పాత్ర‌ల‌ను కూడా ఇందులో చూపించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం. ఈ ఏడాది నవంబర్ 5న అంతర్జాతీయంగా విడుదల కానుంది. ఆ తర్వాత నవంబర్ 8న దీపావళి పండుగ కానుకగా భారతదేశంలో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఇలాంటి అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.