Begin typing your search above and press return to search.

ఆర్‌కే 'రామాయణ' కౌసల్య ఎవరో తెలిస్తే షాక్‌..!

ఇటీవల ఇందిరా కృష్ణన్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   31 July 2025 7:00 PM IST
ఆర్‌కే రామాయణ కౌసల్య ఎవరో తెలిస్తే షాక్‌..!
X

రణబీర్ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న 'రామాయణ' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ మూవీకి కానంత ఖర్చును ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. యశ్‌ ఈ సినిమాలో రావణాసురుడు పాత్రలో కనిపించబోతున్నాడు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాలోని ప్రతి పాత్రను ప్రముఖ నటీనటులు పోషించడం విశేషం. సినిమాలో అత్యంత కీలకమైన రాముడి తల్లి కౌసల్య దేవి పాత్రను సీనియర్‌ నటి ఇందిరా కృష్ణన్‌తో చేయిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ఈమె గతంలోనూ రణబీర్‌ కపూర్‌ సినిమాలో నటించింది. రణబీర్‌ కపూర్‌ నటించిన యానిమల్‌ సినిమాలో ఈమె కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

రణబీర్ కపూర్‌ తల్లి పాత్రలో ఇందిరా కృష్ణన్‌

రామాయణ సినిమాలోని ప్రతి పాత్ర కోసం ఆడిషన్స్‌ నిర్వహించి మరీ దర్శకుడు నితేష్‌ తివారీ నటీనటులను ఎంపిక చేశారనిత తెలుస్తోంది. రాముడి తల్లి కౌసల్య దేవి పాత్ర కోసం పలువురిని ఆడిషన్స్ ద్వారా పరిశీలించిన తర్వాత చివరకు ఇందిరా కృష్ణన్‌ ను ఎంపిక చేశారట. ఈమె గతంలో రణబీర్‌ కపూర్‌కి యానిమల్‌ సినిమాలో అత్త పాత్రలో నటించింది. ఆ సినిమాలో కనిపించింది కొద్ది సమయం అయినా నోటెడ్‌ పాత్రను చేసింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు పూర్తి విరుద్దంగా రణబీర్‌ కపూర్‌కి తల్లి పాత్రలో ఈమె నటించడం విశేషం. ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. రామాయణంలో కౌసల్య పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యానిమల్‌ లో ఆమెకు ఆశించిన స్థాయిలో స్క్రీన్‌ టైం దక్కలేదు. కానీ ఈ సినిమాలో ఆ సినిమాతో పోల్చితే కాస్త ఎక్కువగానే స్క్రీన్‌ టైం లభించే అవకాశాలు ఉన్నాయి.

ఇందిరా కృష్ణన్‌ కాస్టింగ్‌ కౌచ్‌ వ్యాఖ్యలు

ఇటీవల ఇందిరా కృష్ణన్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆమె ఒక సౌత్‌ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. హీరోయిన్‌గా నటించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. కెరీర్‌ ఆరంభంలో సౌత్‌ దర్శకుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడం ద్వారా సంచలనం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ సౌత్‌ దర్శకుడు ఎవరై ఉంటారా అని చాలా మంది చాలా రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. ఈమె తెలుగు దర్శకుల గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిందా అనే కోణంలోనూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

రామాయణ సినిమా తర్వాత మరింత బిజీ

బుల్లి తెరపై సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఇందిరా కృష్ణన్‌ బాలీవుడ్‌లో చేసిన సినిమాలు కొన్నే అయినా గుర్తిండి పోయే విధంగా తన ముద్రను వేసింది అనడంలో సందేహం లేదు. ఈమె నటించిన బుల్లి తెర సీరియల్స్ పలు భాషల్లో డబ్‌ కావడం వల్ల దేశ వ్యాప్తంగా ఈమెకు గుర్తింపు ఉంది. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మరిన్ని సినిమాలను చేయాలని ఈమె భావిస్తుంది. బుల్లి తెరను ఇప్పటికీ ఈమె వదిలి పెట్టలేదు. ఇప్పటికీ కలర్స్‌ లో వచ్చే ఒక టీవీ షో లో ఈమె కనిపిస్తూనే ఉంది. సోషల్‌ మీడియా ద్వారా ఈమె రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇప్పుడు రామాయణ సినిమాలో కౌసల్య దేవి పాత్రలో నటిస్తున్న కారణంగా ఈమెకు ఫ్యూచర్‌లో మరిన్ని మంచి ఆఫర్లు వస్తాయనే విశ్వాసంను పలువురు వ్యక్తం చేస్తున్నారు.