Begin typing your search above and press return to search.

రామాయణం గ్లోబల్ రిలీజ్ వ్యూహం: సరికొత్త బాక్సాఫీస్ ప్రయోగానికి తెర!

నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రం విడుదల తేదీలపై సినీ వర్గాల్లో చర్చ మొద‌లైంది.

By:  Srikanth Kontham   |   18 Aug 2026 2:30 PM IST
రామాయణం గ్లోబల్ రిలీజ్ వ్యూహం: సరికొత్త బాక్సాఫీస్ ప్రయోగానికి తెర!
X

నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రం విడుదల తేదీలపై సినీ వర్గాల్లో చర్చ మొద‌లైంది. సినిమాను నవంబర్ 6న అంతర్జాతీయ మార్కెట్లలో, నవంబర్ 8న భారతదేశంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రమైన‌ `ది ఒడిస్సీ` తరహాలో ఐమాక్స్ ఫార్మాట్‌ను నమ్ముకుంటూ గ్లోబల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. భారతీయ పౌరాణిక ఇతిహాసాన్ని ప్రపంచస్థాయి ప్రేక్షకులకు చేరువ చేయడానికి అనుసరిస్తున్న విధానం టాలీవుడ్, బాలీవుడ్ అనే హద్దులను చెరిపేస్తూ సరికొత్త మైలురాళ్లను సృష్టించే అవకాశాన్ని కల్పిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో రెండు రోజులు ముందుగా సినిమాను ప్రదర్శించడం ద్వారా ఓవర్సీస్ ప్రీ-సేల్స్ కలెక్ష న్లపై అద్భుతమైన ప్రభావం ఉంటుంది. హాలీవుడ్ చిత్రాల మాదిరిగా ముందుగానే ఓవర్సీస్ లో ప్రీమియర్లు మరియు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం వల్ల గ్లోబల్ ఆడియన్స్ లో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ముఖ్యం గా నార్త్ అమెరికా, యూరప్ , చైనా వంటి ప్రధాన విదేశీ మార్కెట్లలో వీకెండ్ రన్ ను పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి ఎర్లీ రిలీజ్ వ్యూహం ఎంతో దోహద పడుతుంది. ఇది సినిమాకు ప్రారంభ వసూళ్ల పరంగా బలమైన పునాది వేయడమే కాకుండా లాభాల బాటను మరింత సులభతరం చేస్తుంది.

ఇండియాలో విడుదలకు ముందే విదేశాల నుంచి వచ్చే పాజిటివ్ మౌత్ టాక్ దేశంలోని ప్రేక్షకులకు మేలిమి సంకే తంగా మారుతుంది. సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో ఫస్ట్ డే టాక్ ఎలా ఉంటుందోననే టెన్షన్ మేకర్స్ లో ఉంటుంది. అయితే ఓవర్సీస్ లో రెండు రోజుల ముందే సినిమా టాక్ బయటకు రావడం వల్ల అక్కడ వచ్చే ప్రశంసలు , రివ్యూలు భారతదేశంలోని ప్రేక్షకులలో అంచనాలను తారాస్థాయికి చేర్చుతాయి. ఈ పాజిటివ్ బజ్ వల్ల దేశీయంగా మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించిన దానికంటే అత్యధిక స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంటుంది.

ఈ గ్లోబల్ అప్రోచ్ వల్ల బాక్సాఫీస్ వద్ద తొలివారంలోనే వందల కోట్ల వసూళ్లను రాబట్టడానికి అవకాశం లభిస్తుంది. సాధారణంగా ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలతో పోలిస్తే స్టెప్-బై-స్టెప్ రిలీజ్ విధానం కలెక్షన్లను మరింత సుస్థిరం చేస్తుంది. ఓవర్సీస్ లో వచ్చే డాలర్ల రూపేణా కలెక్షన్లు సినిమా బడ్జెట్ రికవరీని చాలా వేగవంతం చేస్తాయి. దీనిద్వారా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లడమే కాకుండా మొదటి వీకెండ్ ముగిసేసరికి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం దక్కుతుంది.

అంతర్జాతీయంగా ఎర్లీ రిలీజ్ చేయడం ద్వారా చైనా వంటి పెద్ద విదేశీ మార్కెట్లలో భారతీయ చిత్రాలకు ఉన్న మార్కెట్ పరిధి మరింత విస్తరిస్తుంది. నితీష్ తివారీ గత చిత్రమైన `దంగల్` చైనా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు `రామాయణం` వంటి విజువల్ వండర్ ను గ్లోబల్ ఐమాక్స్ స్క్రీన్లపై ముందుగా ప్రదర్శించడం వల్ల విదేశీ సినీ ప్రియులు ప్రత్యేకంగా థియేటర్ల వైపు ఆకర్షితులవుతారు. దేశ‌ సాంస్కృతిక ఇతిహాసాలను హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వాల్యూస్‌తో ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ వ్యూహం అద్భుతమైన వేదికగా నిలుస్తుంది.

నితీష్ తివారీ బృందం అమలు చేస్తున్న ఇంటర్నేషనల్ రిలీజ్ ప్లాన్ ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ మార్కెట్ లో మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. పాత పద్ధతులకు స్వస్తి పకుతూ హాలీవుడ్ బిజినెస్ మోడల్స్ ను అనుసరించడం ఇక్క‌డ దర్శక-నిర్మాతల కొత్త ఆలోచనా ధోరణికి నిదర్శనం. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో రాబోయే ప్రతి పాన్-ఇండియా ప్రాజెక్ట్ కి ఇదొక ట్రెండ్ సెట్టర్ గా మారుతుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టడంలో ఈ వ్యూహం చారిత్రక పరిణామంగా నిలిచిపోతుంది.