Begin typing your search above and press return to search.

రామాయణం రేంజ్ మామూలుగా లేదుగా.. గ్లోబల్ లెవెల్లో గ్రాండ్ ప్లానింగ్!

రీసెంట్ గా ఈవెంట్ కు సంబంధించిన విజువల్ వీడియోను రిలీజ్ చేయగా ఆది వైరల్ అవుతోంది.

By:  M Prashanth   |   21 July 2026 10:32 PM IST
రామాయణం రేంజ్ మామూలుగా లేదుగా.. గ్లోబల్ లెవెల్లో గ్రాండ్ ప్లానింగ్!
X

పురాణాల్లో ఎంతో ప్రత్యేకమైన రామాయణాన్ని ఇప్పుడు సరికొత్తగా స్క్రీన్ మీదకు తీసుకువస్తున్నారు. కేవలం ఇండియా వరకే పరిమితం చేయకుండా వరల్డ్ వైడ్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ పేరుతో ఒక గ్రాండ్ ఈవెంట్ చేసి ఈ సినిమా ప్రమోషన్ జర్నీని అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. ఈ వేడుక చూస్తుంటే ఇండియన్ సినిమా రేంజ్ ఇంకో లెవెల్ కు వెళ్లడం ఖాయం అనిపిస్తోంది. రీసెంట్ గా ఈవెంట్ కు సంబంధించిన విజువల్ వీడియోను రిలీజ్ చేయగా ఆది వైరల్ అవుతోంది.

దంగల్ దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమా కోసం సెట్ చేసిన యాక్టర్ల లైనప్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా మన సాయి పల్లవి నటిస్తుంటే.. మోస్ట్ పవర్ ఫుల్ రావణుడి రోల్ లో కేజీఎఫ్ స్టార్ యష్ దిగుతున్నాడు. ఇక ఆంజనేయ స్వామిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే లాంటి స్టార్స్ తో సెట్ అంతా నిండిపోయింది. ఈ ప్రథమ్ సంకల్ప్ ఈవెంట్ కు వచ్చిన వీళ్లంతా తమ రోల్స్ మీద ఉన్న రెస్పెక్ట్ ను చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు.

ముఖ్యంగా సాయి పల్లవి ఈ క్యారెక్టర్ గురించి చెప్పిన మాటలు ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. సీతమ్మ క్యారెక్టర్ చేయడం అనేది తాను ప్లాన్ చేసుకోలేదని, అదొక వరంగా ఫీల్ అవుతున్నానని చెప్పింది. ఆ పవిత్రమైన క్యారెక్టర్ కు న్యాయం చేయడానికి రోజూ మెడిటేషన్ చేసేదాన్నని, మైండ్ ను ప్రశాంతంగా ఉంచుకునేదాన్నని తన అనుభవాలను పంచుకుంది. దేవుళ్ల పాత్రలు దొరకడం నిజంగా అదృష్టమే అంటూ ఆమె ఎమోషనల్ అయింది.

డైరెక్టర్ నితీష్ తివారీ కూడా తన యాక్టర్ల మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. రణబీర్ కళ్లలో రాముడు, సాయి పల్లవి కళ్లలో సీతమ్మ కనిపించారని ఆయన చెప్పిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాళ్ల కళ్లలో ఉన్న నిజాయితీ చూసే కాస్టింగ్ ఫిక్స్ చేశానని చెప్పడం విశేషం. కేవలం స్టార్ డమ్ చూసి కాకుండా, క్యారెక్టర్ కు ఎవరు యాప్ట్ అవుతారో వాళ్లనే తీసుకున్నట్లు డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.

టెక్నికల్ గా కూడా ఈ సినిమా హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో రెడీ అవుతోంది. ఆస్కార్ విన్నర్స్ హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్లు మ్యూజిక్ ఇస్తుండగా.. ప్రైమ్ ఫోకస్, డీఎన్ఈజీ లాంటి వరల్డ్ క్లాస్ స్టూడియోలు వీఎఫ్ఎక్స్ వర్క్ చూసుకుంటున్నాయి. నిర్మాత నమిత్ మల్హోత్రా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఐమ్యాక్స్ క్వాలిటీలో దీన్ని తెరకెక్కిస్తున్నారు.

జులై 24న గ్లోబల్ లెవెల్లో ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఇక పార్ట్ 1 ను 2026 దీపావళికి, పార్ట్ 2 ను 2027 దీపావళికి రిలీజ్ చేస్తామని పక్కాగా అనౌన్స్ చేశారు. పౌరాణిక నేపథ్యం ఉన్న సబ్జెక్టులను తెరపైకి తీసుకురావడం అంటే మామూలు సాహసం కాదనే చెప్పాలి. ఏ చిన్న లాజిక్ మిస్ అయినా ఆడియన్స్ నుంచి ట్రోల్స్ తప్పవు. అందుకే ఈ జనరేషన్ కు నచ్చేలా అదిరిపోయే విజువల్స్ ఇస్తూనే, ట్రెడిషనల్ ఎమోషన్స్ మిస్ కాకుండా మేకర్స్ చాలా బ్యాలెన్స్డ్ గా అడుగులు వేస్తున్నారు. ఫస్ట్ ఈవెంట్ తోనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన రామాయణం టీమ్.. త్వరలో రాబోయే ట్రైలర్ తో ఇంకెంత మ్యాజిక్ చేస్తుందో చూడాలి.