రామాయణం స్పెషల్ ప్రమోషన్స్!
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'రామాయణం' ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ సరికొత్త వ్యూహాలకు తెరలేపారు.
By: Srikanth Kontham | 13 Aug 2026 3:00 PM ISTభారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'రామాయణం' ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ సరికొత్త వ్యూహాలకు తెరలేపారు. సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేలా ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 18న జరగబోయే బిగ్ సినీ ఎక్స్పో 2026 వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్‌ను ప్రదర్శించనున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే? ఈ విజువల్స్ సాధారణ ప్రేక్షకులకు కాకుండా థియేటర్ ఓనర్స్ , ఇండస్ట్రీ ప్రతినిధుల కోసం మాత్రమే ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటివరకు బయట ప్రపంచానికి చూపించని కొన్ని అరుదైన, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన విజువల్స్ ఇందులో ఉండనున్నాయి. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా? ఉండబోతుందో ట్రేడ్ వర్గాలకు ముందే పరిచయం చేయడమే ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఉద్దేశం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ విజువల్ గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. బిగ్ సినీ ఎక్స్పోలో ప్రదర్శించబోయే ఫుటేజ్ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని, థియేటర్ యజమానుల్లో సరికొత్త జోష్ నింపుతుందని చిత్ర బృందం బలంగా విశ్వసిస్తోంది.
విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో నెలకొన్న అంచనాలు ఈ ప్రదర్శనతో మరింత బలపడనున్నాయి. సినిమా విడుదల తేదీకి సంబంధించి కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే స్పష్టతకు వచ్చింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ మహాకావ్యం అత్యంత వైభవంగా ఈ ఏడాది దివాళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ మేకర్స్ చేస్తున్న భారీ ప్లానింగ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు .. గ్రాఫిక్స్ వర్క్ అత్యంత వేగంగా జరుగుతున్నాయి. రామాయణ ఇతిహాసాన్ని ఆధునిక సాంకేతికతతో, నూతన హంగులతో తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు - సాంకేతిక నిపుణుల బృందం ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా మలుస్తోంది. నటీనటుల ఎంపిక నుండి ప్రతి చిన్న వివరంలోనూ క్వాలిటీ తగ్లకుండా చూసుకుంటున్నారు.
భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ ఇతిహాసాన్ని సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించేందుకు దర్శకుడు చేస్తున్న కృషికి సాంకేతిక నిపుణుల ప్రతిభ తోడై తెరపై ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని ముందే జోస్యం చెబు తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత నిర్మాణ విలువలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ క్రియేట్ చేస్తున్న హైప్ తో అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి.
