Begin typing your search above and press return to search.

ఆరంభంలో విమర్శలు.. ఇప్పుడు ప్రశంసల వర్షం!

నితేష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రం చుట్టూ రోజూ ఏదో వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది.

By:  Srikanth Kontham   |   22 Oct 2026 5:00 PM IST
ఆరంభంలో విమర్శలు.. ఇప్పుడు ప్రశంసల వర్షం!
X

నితేష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రం చుట్టూ రోజూ ఏదో వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. దసరా పండుగ సందర్భంగా విడుదల చేసిన `రావణ తాండవ్` పాటతో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. యశ్ రావణుడి పాత్రలో కనిపించిన శివస్తోత్రం సాంగ్‌కు రెహమాన్ అందించిన మ్యూజిక్ చాలా సాధారణంగా ఉందంటూ అనేకమంది నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరైతే రాబోయే సీక్వెల్‌కు వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చాలని కూడా నిర్మాతలను కోరారు.

అయితే తాజాగా చెన్నైలో అత్యంత వైభవంగా నిర్వహించిన `రామాయణం` ఆల్బమ్ లాంచ్ ఈవెంట్‌తో పరిస్థితి ఒక్కసారిగా 180 డిగ్రీలు తిరిగేసింది. ఈ వేడుకలో ప్రదర్శించిన కొత్త పాటలు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా రెహమాన్ సత్వరమే తన మార్కును మళ్లీ నిరూపించుకునేలా చేశాయి. ముఖ్యంగా ఈవెంట్‌లో పరిచయం చేసిన `జోడి జోడి` అనే పెళ్లి పాట సోషల్ మీడియాలో వైరల్ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంది. దీంతో ఆరంభంలో విమర్శించిన వారే ఇప్పుడు ఆయన దివ్యమైన మ్యూజిక్‌కు ఫిదా అయిపోతున్నారు.

చిత్రంలో సీతా రామ కళ్యాణ ఘట్టం నేపథ్యంతో సాగే `జోడి జోడి` వివాహ గీతాన్ని గాయని చిన్మయి శ్రీపాద ఆల పించగా.. కుమార్ విశ్వాస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. యూట్యూబ్‌లో ఈ పాట అధికారికంగా ఇంకా విడుదల కానప్పటికీ చెన్నై ఈవెంట్ లైవ్ పెర్ఫార్మెన్స్ క్లిప్స్ ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. 90ల నాటి క్లాసిక్ మెలోడీ ఎమోషన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న పాటలో అచ్చమైన మిథిలా ప్రాంతపు పెళ్లి వైబ్స్ ఉన్నాయని, ఇది రెహమాన్ అందించిన ఓ అద్భుతమైన మాస్టర్‌పీస్ అని శ్రోతలు కొనియాడుతున్నారు.

ఈ సరికొత్త సంగీత మాయాజాలాన్ని విన్న నెటిజన్లు `రావణ తాండవ్` విడుదల సమయంలో రెహమాన్‌ను తక్కువ అంచనా వేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా `మమ్మల్ని క్షమించండి రెహమాన్ గారూ.. మీ ప్రతిభను శంకించినందుకు విచారిస్తున్నాం` అని వరుస కామెంట్లతో అభిమానులు క్షమాపణలు కోరుతున్నారు. అలాగే సినిమాలోని సంగీతానికి గానూ రెహమాన్ ఖాతాలో మరో ఆస్కార్ ఖాయమనే స్థాయిలో రీ-ట్వీట్లు.. పోస్టులతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంగీత పరంగా భారీ హైప్ తెచ్చుకుంటున్న పౌరాణిక దృశ్యకావ్యంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా.. సన్నీ డియోల్ హనుమంతుడిగా, యశ్ రావణాసురుడిగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు రవి దూబే, లారా దత్తా, కాజల్ అగర్వాల్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపిం చనున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోయే ప్రాజెక్ట్‌గా నిర్మాణం జరుపుకుంటోంది.

రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మహా కావ్యం మొదటి భాగం నవంబర్ 5 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆరంభంలో చిన్నపాటి విమర్శలు ఎదురైనా? తాజాగా `జోడి జోడి` పాటతో వచ్చిన పాజిటివ్ టాక్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. రెహమాన్ అందించిన ఈ సరికొత్త స్వరాలు సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అభిమానులు విశ్వసిస్తున్నారు.