Begin typing your search above and press return to search.

3300 కోట్ల బ‌డ్జెట్‌లో హీరో ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు 660కోట్లు?

దాదాపు 3300కోట్ల బ‌డ్జెట్ తో న‌మిత్ మ‌ల్మోత్రా `రామాయ‌ణం` ఫ్రాంఛైజీని నిర్మిస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు.

By:  Sivaji Kontham   |   29 Sept 2025 1:39 AM IST
3300 కోట్ల బ‌డ్జెట్‌లో హీరో ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు 660కోట్లు?
X

దాదాపు 3300కోట్ల బ‌డ్జెట్ తో న‌మిత్ మ‌ల్మోత్రా `రామాయ‌ణం` ఫ్రాంఛైజీని నిర్మిస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. ర‌ణ‌బీర్ క‌పూర్, య‌ష్‌, సాయిప‌ల్ల‌వి, స‌న్నీడియోల్ వంటి పెద్ద స్టార్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం రామాయ‌ణం పార్ట్ 1 చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. అయితే ఈ ఫ్రాంఛైజీ బ‌డ్జెట్ లో ఎవ‌రికి ఎంత వాటా వెళుతుంది? అనేదానికి న‌మిత్ మ‌ల్హోత్రా ఇచ్చిన వివ‌ర‌ణ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

నిజానికి ఆయ‌న పారితోషికాల విష‌యంలో 20: 80 నియ‌మాన్ని అనుస‌రిస్తున్నాన‌ని తెలిపాడు. హీరో, ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల కోసం 20 శాతం, మిగ‌తాది ఇత‌ర కీల‌క‌మైన సినీనిర్మాణం కోసం ఖర్చు అని చెప్పాడు. అంటే అన‌వ‌స‌రంగా హీరో- డైరెక్ట‌ర్ కోసం స‌గం బ‌డ్జెట్ పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని అత‌డు స్ప‌ష్ఠంగానే చెప్పాడు. అయితే 20 శాతంలోనే హీరో పారితోషికం, ద‌ర్శ‌కుడి పారితోషికంతో పాటు ర‌చ‌యిత‌ల బృందం పారితోషికం కూడా ఉంటుంది. మిగ‌తా 80శాతం నుంచి సంగీతం, సెట్లు, వీఎఫ్ఎక్స్, కాస్ట్యూమ్స్, స్టంట్స్, ఎడిటింగ్ అంటూ 24 విభాగాలకు చెల్లించాలి. చాలా మంది ఇత‌ర స్టార్ల‌కు కూడా దీని నుంచే అత‌డు చెల్లిస్తాడు.

దీనిని బ‌ట్టి ర‌ణ‌బీర్ క‌పూర్ కి, ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న నితీష్ తివారీ వంటి వారికి ఏమేర‌కు పారితోషికం ముడుతుందో అంచ‌నా వేస్తున్నారు. దాదాపు 3,300 కోట్ల బ‌డ్జెట్‌లో 20 శాతం అంటే 660 కోట్లు. ఈ మొత్తాన్ని ర‌ణ‌బీర్, నితీష్ తివారీ అత‌డి ద‌ర్శ‌క‌త్వ బృందం పంచుకుంటారు. ఇది స‌ముచిత‌మైన‌దేన‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఏ.ఆర్.రెహ‌మాన్, హ‌న్స్ జిమ్మ‌ర్ లాంటి దిగ్గ‌జాల‌కు భారీ ప్యాకేజీలు ముట్ట‌జెప్పాల్సి ఉంటుంది. అయితే ఇంత పెద్ద బ‌డ్జెట్ సినిమా వ‌ర్క‌వుట‌వ్వాలంటే కేవ‌లం ఇండియా వ‌సూళ్లు స‌రిపోవు. వ‌ర‌ల్డ్ వైడ్ దీనిని ఒక హాలీవుడ్ సినిమా రేంజులో విడుద‌ల చేయాల్సి ఉంటుంది. న‌మిత్ మ‌ల్హోత్రాకు చెందిన డిఎన్ఇజి సంస్థ వీ.ఎఫ్.ఎక్స్ ని ప‌ర్య‌వేక్షిస్తోంది. `అవ‌తార్` రేంజ్ విజువ‌ల్స్ ని భార‌తీయ పురాణేతిహాస క‌థ కోసం ఆవిష్క‌రిస్తార‌ని ప్ర‌జ‌లు అంచ‌నా వేస్తున్నారు. ఆ రేంజుకు త‌గ్గితే థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న‌ది న‌మిత్ మ‌ల్హోత్రా బృందం గ్ర‌హించాల్సి ఉంటుంది. ఓవైపు ఇబ్బ‌డిముబ్బ‌డిగా భారీ బ‌డ్జెట్ల తో రూపొందుతున్న హాలీవుడ్ సినిమాల వెల్లువ‌లో మునుముందు భారతీయ సినిమాల క్వాలిటీని బ‌డ్జెట్లు కూడా డిసైడ్ చేయ‌నున్నాయి.