సిద్దు, నవీన్‌ల దారిలో రామ్...!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ స్థాయి విజయం రామ్ చూడలేదు.
By: Ramesh Palla | 20 Feb 2026 2:00 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ స్థాయి విజయం రామ్ చూడలేదు. గత నాలుగు ఐదేళ్లుగా రామ్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. గత ఏడాది 'ఆంధ్రా కింగ్ తాలూక' సినిమాతో రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దర్శకుడి యొక్క పనితనం కి కూడా మంచి మార్కులు పడ్డాయి. స్క్రీన్ ప్లే బాగుందని అంతా మెచ్చుకున్నారు. కానీ సినిమాకు కలెక్షన్స్ మాత్రం రాలేదు. చాలా మంది ఓటీటీలో సినిమాను చూసి వావ్ అన్నారు కానీ, థియేట్రికల్ రన్ సమయంలో మాత్రం అటువైపు వెళ్లలేదు. సినిమాకు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేద్దాం అన్నట్లుగానే ఉన్నారు.
రామ్ ఆంధ్రా కింగ్ తాలూక సినిమా...
ఆంధ్రా కింగ్ తాలూక సినిమా తర్వాత రామ్ సన్నిహితుల వద్ద చాలా ఆవేదన వ్యక్తం చేశాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రామ్ తిరిగి కొత్త సినిమా పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తనకు నమ్మకస్తుడు అయిన దర్శకుడు కిషోర్ తిరుమల వద్ద రామ్ ఒక కథను తీసుకున్నాడట. ఆ కథ తో పాటు మరో కథను రామ్ ఇప్పుడు డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. రెండు కథల పై వర్క్ జరుగుతోంది. రామ్ కి ఒక రైటింగ్ టీమ్ ఉంటుంది. ఆ టీమ్ ఇప్పుడు ఆ రెండు కథలను ఫైనల్ చేసే విధంగా సిట్టింగ్స్ లో ఉన్నారు. ఇక్కడ చెప్పుకోవద్ద విషయం ఏంటంటే కథ చర్చల్లో రామ్ ప్రధానంగా పాల్గొంటున్నాడు. అధికారికంగా ఈ సినిమా కు రామ్ రైటర్ గా వ్యవహరించబోతున్నట్లుగా ఆయన సన్నిహితులు, మీడియా సర్కిల్స్ వారి ద్వారా సమాచారం అందుతోంది.
సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి....
ఇప్పటికే నవీన్ పొలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలు కథ విషయంలో చాలా ఇన్వాల్వ్ అవుతారు. అంతే కాకుండా రైటింగ్ విషయంలో ఇద్దరు హీరోలు పూర్తి ఇన్వాల్వ్‌మెంట్ అవుతారని టాక్ ఉంది. టైటిల్ కార్డ్ పడకున్నా దర్శకత్వం సైతం ఈ హీరోలు చేస్తారు అనే టాక్ ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు రామ్ కూడా రైటింగ్ పై పూర్తి ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది. చాలా సినిమాలు చేసిన అనుభవం ఉన్న రామ్ కి రైటింగ్ పై పట్టు ఉండటం చాలా కామన్ విషయం. అయితే పూర్తి ఇన్వాల్వ్‌మెంట్‌తో రైటింగ్ పై దృష్టి పెట్టడం ఎంతవరకు సాధ్యం అని కొందరు భావిస్తున్నారు. సినిమా షూటింగ్‌కి ముందు స్క్రిప్ట్ విషయంలో రామ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే మేకింగ్ సమయంలోనూ ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉండే అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు. ఇప్పటి వరకు రామ్ తదుపరి సినిమా దర్శకుడు ఎవరు అనే విషయం లో క్లారిటీ రాలేదు.
రామ్ నిర్మాణంలో కొత్త సినిమా...
నవీన్, సిద్దు సినిమాలకు దర్శకులు కొత్త వారు పని చేస్తారు. దాంతో వీరి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందని అంటారు. అందుకే రామ్ సైతం తన తదుపరి సినిమాకి కొత్త దర్శకుడిని తీసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది అనేది ఆయన కాంపౌండ్ ఆలోచనగా తెలుస్తోంది. కేవలం రైటింగ్ విషయంలోనే కాకుండా నిర్మాణంలోనూ రామ్ పాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయి. తన సొంత బ్యానర్‌లో రామ్ ఈ సినిమాను నిర్మించే యోచన చేస్తున్నాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక నిర్మాతలు ఎవరూ సెట్ కాకుంటే అప్పుడు రామ్ సొంతంగా రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి రామ్ ఈసారి సొంత ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సఫలం అవుతుంది అనేది చూడాలి. రామ్ గత చిత్రాల ఫలితాలు కచ్చితంగా రాబోయే సినిమాపై ఉంటుంది. దాన్ని అధిగమించే విధంగా ఈ సినిమా ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
