Begin typing your search above and press return to search.

బావా బావమరుదులు రిస్క్ చేస్తున్నారా?

టాలీవుడ్ యంగ్ హీరోలు, బావా బావమరుదులు శర్వానంద్, రామ్ ప్రస్తుతం తమ అప్ కమింగ్ మూవీలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   15 Nov 2025 4:00 PM IST
బావా బావమరుదులు రిస్క్ చేస్తున్నారా?
X

టాలీవుడ్ యంగ్ హీరోలు, బావా బావమరుదులు శర్వానంద్, రామ్ ప్రస్తుతం తమ అప్ కమింగ్ మూవీలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి విజయం సాధించి గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అందుకు గాను కొత్త చిత్రాల కోసం బాగా కష్టపడుతున్నారు.

అందులో భాగంగా ఇప్పుడు రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా.. శర్వానంద్ బైకర్ మూవీలతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే రెండు సినిమాలపై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఆయా చిత్రాల మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇప్పుడు శర్వా, రామ్ రిస్క్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. వారిద్దరి సినిమాలు రెండూ కూడా అఖండ 2 తాండవం రిలీజ్ అయిన దగ్గర్లోనే విడుదల కానున్నాయి. ఆంధ్రా కింగ్ తాలూకాకు కాస్త గ్యాప్ అయినా ఉన్నా.. బైకర్ మూవీ అఖండ 2 వచ్చిన నెక్స్ట్ డేనే రానుంది.

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటిస్తున్న అఖండ-2.. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవ్వగా.. డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అక్కడికి వారం ముందు నవంబర్ 28వ తేదీన ఆంధ్రా కింగ్ తాలూకా విడుదల అవ్వనుంది.

దీంతో అనుకున్నట్లు అఖండ-2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కచ్చితంగా రామ్ మూవీపై ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ ఆంధ్రా కింగ్ తాలూకా హిట్ అయినా కూడా అఖండ-2 వచ్చాక సినీ ప్రియుల దృష్టి అటు మల్లుతుంది. అందుకే థియేట్రికల్ రన్ పై ప్రభావం పడనుంది. వారం వరకు ఓకే అయినా ఆ తర్వాత వసూళ్లు తగ్గుతాయి.

అదే సమయంలో బైకర్ మూవీ డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. అఖండ సీక్వెల్ ముందు ఆ సినిమా తట్టుకోవాలంటే అదిరిపోయే టాక్ రావాలి. ఎందుకంటే అఖండకు పోటీగా రిలీజ్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. బైకర్ వసూళ్లపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే రామ్, శర్వా రిస్క్ చేస్తున్నారని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. మరేం జరుగుతుందో.. బావ బావమరుదులు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వేచి చూడాలి.