ఆర్కా మీడియాలో టాలెంటెడ్ హీరో సినిమా?
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న మహేష్ బాబు. పి దర్శకత్వంలో రామ్ పోతినేని చేసిన ఈ ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Sravani Lakshmi Srungarapu | 3 Nov 2025 8:00 PM ISTటాలీవుడ్ లోని మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని కూడా ఒకరు. అందానికి అందం, పెర్ఫార్మెన్స్ కు పెర్ఫార్మెన్స్, డ్యాన్సులకు డ్యాన్సులు.. ఇలా ప్రతీ విషయంలోనూ రామ్ ముందు వరుసలో ఉంటారు. కానీ కథల ఎంపిక విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలే రామ్ ను ఇవాళ ఈ స్టేజ్ లో ఉంచాయి. వాస్తవానికి అతనికున్న టాలెంట్ కు రామ్ ఎప్పుడో టైర్2 టాప్ స్టార్ అయిపోవాల్సింది.
ఇస్మార్ట్ శంకర్ తో ఆఖరి హిట్
కానీ అతను చేసే సినిమాల వల్ల ఇప్పటికీ టైర్2 లో నిలదొక్కుకోవడానికి ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. రామ్ ఆఖరిగా హిట్ అందుకుంది అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తోనే. ఆ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అవేవీ రామ్ కెరీర్ కు ఉపయోగపడకపోగా, అతని మార్కెట్ ను డౌన్ చేశాయి. దీంతో తనకు బాగా నప్పే జానర్ కు వచ్చి మళ్లీ సినిమాలు చేయాలని భావించిన రామ్ ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
నవంబర్ 28న ఆంధ్రా కింగ్ తాలూకా
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న మహేష్ బాబు. పి దర్శకత్వంలో రామ్ పోతినేని చేసిన ఈ ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం ప్రమోషన్స్ ను మొదలుపెట్టడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచ రెస్పాన్స్ వచ్చింది.
కొత్త డైరెక్టర్ తో నెక్ట్స్ మూవీ
షూటింగ్ పూర్తయ్యాక చిత్ర యూనిట్ కూడా మూవీ అవుట్‌పుట్ పై సంతృప్తిగా ఉన్నారని, ఈ సినిమాతో రామ్ సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రా కింగ్ తర్వాత రామ్ చేయబోయే సినిమా ఏంటి? దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రామ్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు రాగా, ఇప్పుడు ఓ కొత్త డైరెక్టర్ తో రామ్ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కిషోర్ అనే కొత్త డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆర్కా మీడియాలో రామ్ ఈ సినిమాను చేయనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
