రామ్ మాత్రమే కాదు భాగ్యశ్రీ కూడా..
రామ్ పోతినేని హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా.. ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
By: Madhu Reddy | 8 Nov 2025 8:28 PM ISTరామ్ పోతినేని హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా.. ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు చిత్ర బృందం. అందులో భాగంగానే అటు హీరో రామ్ పోతినేని, ఇటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తమ వంతు ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆ ఇంటర్వ్యూలో భాగంగానే ఇద్దరు తమ టాలెంట్ ను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి ఇప్పటివరకు పప్పీ షేమ్, నువ్వుంటే చాలు, చిన్ని గుండెల్లో అంటూ మూడు పాటలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే అయితే ఇక్కడే రామ్ తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఒక పాటకు లిరిక్స్ అందించి లిరిసిస్ట్ గా తనలోని టాలెంట్ ను బయట పెట్టగా.. మరో పాటను పాడి ఆకట్టుకున్నారు. అలా ఈ చిత్రంతో హీరోగానే కాకుండా సింగర్ గా కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు రామ్ పోతినేని. ఈ విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా తెలిపారు.
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ.. రామ్ తన టాలెంట్ ను బయట పెట్టుకున్నారు. మీరు కూడా సింగర్ అని తెలిసింది. మా కోసం రెండు లైన్లు పాడండి అని అడగగా అటు భాగ్యశ్రీ బోర్సే కూడా అద్భుతంగా పాట పాడి అందరినీ ఆకట్టుకుంది. ఇందులో రామ్ పోతినేని భాగ్యశ్రీ పాటకు వందకు వంద మార్కులు వేసేశారు. అలా మొత్తానికైతే రామ్ పోతినేని మాత్రమే కాకుండా ఇటు భాగ్యశ్రీ కూడా పాటలు పాడి.. సింగర్ గా తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇటు భాగ్యశ్రీపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
భాగ్యశ్రీ బోర్సే విషయానికొస్తే.. యారియాన్ 2 సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కింగ్డమ్ అనే చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో భాగ్యశ్రీకి ఎలాంటి సక్సెస్ లభిస్తుందో చూడాలి. మరొకవైపు రానా, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో వస్తున్న కాంత అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా ఈమెకు తొలి తమిళ్ చిత్రం కావడం గమనార్హం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఇందులో తన పాత్రతో ఆకట్టుకుంది భాగ్యశ్రీ.
