రామ్ పోతినేని 'RAPO23' ప్రీ లుక్ రిలీజ్.. చేతిలో గన్, మరో చేతిలో టెడ్డీ బేర్!
రామ్ పోతినేని నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న #RaPo23 ప్రీ లుక్ విడుదలైంది. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్’ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన పోస్టర్‌లో గన్, టెడ్డీ బేర్‌తో రామ్ విభిన్న లుక్‌లో కనిపించారు. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
By: Priya Chowdhary Nuthalapti | 19 Nov 2026 1:23 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు హీరోగా ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఈసారి నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చూపించబోతున్నారు. రామ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త సినిమాకు ప్రస్తుతం #RaPo23 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ ప్రత్యేక పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో రామ్ పాత్రకు సంబంధించిన చిన్న పరిచయాన్ని ఇచ్చారు. ఈ సినిమాకు ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ఒంటరిగా తన దారిలో తాను ప్రయాణించే వ్యక్తి కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ ట్యాగ్‌లైన్ ద్వారా అర్థమవుతోంది. ఎవరి మాట వినకుండా తన నిర్ణయాలపై నమ్మకంతో ముందుకు సాగే వ్యక్తిగా రామ్ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రీ లుక్ పోస్టర్‌లో రామ్‌ను వెనుక వైపు నుంచి చూపించారు. ఒక భారీ భవన నిర్మాణంలో ఉన్న మెట్లపై ఆయన నిలబడి కనిపిస్తున్నారు. పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించిన రామ్ చేతిలో ఒక తుపాకీ ఉంది. మరో చేతిలో టెడ్డీ బేర్ ఉండటం ఆసక్తిని పెంచుతోంది. సాధారణంగా తుపాకీ ఒక పవర్‌ఫుల్ పాత్రను సూచిస్తే, టెడ్డీ బేర్ మరో భిన్నమైన కోణాన్ని గుర్తు చేస్తోంది. ఈ రెండు వస్తువులను ఒకేసారి చూపించడం ద్వారా ఆయన పాత్రలో ఎలాంటి ప్రత్యేకత ఉండబోతోందనే ఆసక్తి కలుగుతోంది.
ఇక రామ్ హెయిర్ స్టైల్ కూడా ఈ పోస్టర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల వెనుక భాగంలో V ఆకారంలో ఉన్న హెయిర్ కట్, దానిపై కనిపిస్తున్న టాటూ ఆయన లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. గత సినిమాలతో పోలిస్తే ఈసారి రామ్ పూర్తిగా భిన్నమైన మేకోవర్‌లో కనిపించబోతున్నారని పోస్టర్ స్పష్టం చేస్తోంది.
ఈ సినిమాను రామ్ పోతినేని తండ్రి కృష్ణ పోతినేని, రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టడం ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా రామ్ ఎలాంటి కథను ఎంచుకున్నారు? ఆయన పాత్రలో ఎన్ని షేడ్స్ ఉంటాయి? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రస్తుతం విడుదలైన ప్రీ లుక్‌తోనే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ మూవీ టైటిల్‌తో పాటు రామ్ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
