రాపో నెక్స్ట్.. ఎక్కడా ఏదీ ట్రాక్ తప్పకుండా..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న RAPO23 విషయంలో ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
By: M Prashanth | 13 July 2026 11:12 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న RAPO23 విషయంలో ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ కొత్త జర్నీని ప్రారంభిస్తున్న రామ్.. ఏ చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు వెళ్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టోరీ నుంచి టెక్నికల్ టీమ్ వరకు, క్యాస్టింగ్ సెలెక్షన్ నుంచి మ్యూజిక్ వరకు ప్రతి విషయంలో ట్రాక్ తప్పకుండా కేర్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
రామ్ సొంత కథతో తెరకెక్కుతున్న ఆ మూవీ నియో-నోయర్ బ్యాక్ డ్రాప్ లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా గ్రాండ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని కథ, కొత్త తరహా పాత్రలు, భిన్నమైన ట్రీట్మెంట్ తో సినిమాను డిజైన్ చేయాలన్న టార్గెట్ తో మూవీ టీమ్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.
హీరోగా నటిస్తూనే దర్శకుడిగా బాధ్యతలు చేపట్టిన రామ్.. మొదటి రోజు నుంచే షూటింగ్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టారని సమాచారం. నిర్మాతగా ఆయన సోదరుడు కృష్ణ పోతినేని ఉన్నప్పటికీ, నిర్మాణ వ్యయాల విషయంలోనూ రామ్ స్వయంగా శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేస్తూ, క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడకూడదన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారట.
ఇక సినిమాకు సంగీత దర్శకుడిగా సామ్ సీఎస్ పనిచేస్తున్నారు. కథకు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలవాలని రామ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రతి సన్నివేశానికి తగిన సంగీతం రావాలనే ఉద్దేశంతో తరచూ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే హీరోయిన్ సెలెక్షన్ ఇంకా అఫిషియల్ గా ఫిక్స్ కాలేదు. మొదట పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతం సంయుక్తా మీనన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
కథ, పాత్ర నచ్చడంతో ఆమె కూడా పాజిటివ్ గా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టెక్నికల్ గా కూడా సినిమాను బెస్ట్ వాల్యూస్ తో రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. నేషనల్ అవార్డు విన్నర్ తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలను పీటర్ హైన్ రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను ఏఎస్ ప్రకాశ్ నిర్వహిస్తున్నారు. దీంతో ప్రతి విభాగంలోనూ ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని ఎంపిక చేసి సినిమాకు మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.
అలా RAPO23 విషయంలో రామ్ పోతినేని ఎక్కడా ఏ చిన్న మిస్టేక్ ఉండకూడదన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. హీరోగా, దర్శకుడిగా, స్టోరీ రైటర్ గా మూడు బాధ్యతలను ఒకేసారి నిర్వహిస్తున్న ఆయన.. ప్రతి అంశాన్ని
క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ సినిమాను తన కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలబెట్టాలనే టార్గెట్ తో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆ హార్డ్ వర్క్ స్క్రీన్ పై ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాల్సి ఉంది.
