Begin typing your search above and press return to search.

రామ్ నెక్స్ట్.. ఎంత క్రేజ్ ఉన్నా లెక్క సెట్ అయితేనే..

RAPO 23 సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే విడుదల కావడంతో సినీ ప్రియుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

By:  M Prashanth   |   15 Jun 2026 11:00 PM IST
రామ్ నెక్స్ట్.. ఎంత క్రేజ్ ఉన్నా లెక్క సెట్ అయితేనే..
X

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నెక్స్ట్ మూవీపై అందరి ఫోకస్ ఉంది. వరుస ఫ్లాపుల తర్వాత.. రామ్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించబోతున్న కొత్త ప్రాజెక్టుపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. RAPO 23 సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే విడుదల కావడంతో సినీ ప్రియుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ఆ సినిమాతో రామ్ కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగానూ తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మూవీ టీమ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రామ్ సోదరుడు కృష్ణ చైతన్య ఆ చిత్రాన్ని నిర్మించనునున్నారు

అయితే ఆ ప్రాజెక్ట్ విషయంలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం బడ్జెట్ ప్లానింగ్. ఇటీవల కొన్ని చిత్రాలు భారీ వ్యయంతో తెరకెక్కినా అనుకున్న రేంజ్ లో రిజల్ట్స్ ను అందుకోలేకపోవడంతో, ఈసారి రామ్ లెక్కలు కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారట. కథకు అవసరమైన రేంజ్ లోనే ఖర్చు చేయాలని, వేస్ట్ ఖర్చుకు అవకాశం ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే క్యాస్టింగ్ ఎంపిక విషయంలో కూడా ఫైనాన్సియల్ బ్యాలెన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పాత్రలకు సరిపోయే నటులను సెలెక్ట్ చేయడమే కాకుండా, వారు కోరుతున్న పారితోషికం కూడా ముందుగా అనుకున్న బడ్జెట్‌ కు సరిపోతుందా లేదా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారట. ఎంత క్రేజ్ ఉన్న నటుడైనా, లెక్కలు సరిపోతేనే ముందుకు వెళ్లాలనే ధోరణి కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.

మెయిన్ విలన్ రోల్ కోసం రీసెంట్ గా ఓ స్టార్ యాక్టర్ పేరు పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన డిమాండ్ చేసిన పారితోషికం కారణంగా సైలెంట్ అయినట్లు వినికిడి. మరోవైపు హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా పలువురు బ్యూటీ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ముందుగా ఒక అమ్మడు అనుకున్నా, డేట్లు, పారితోషికం వంటి అంశాలు కీలకంగా మారడంతో ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారట.

ఇదంతా చూస్తుంటే, రామ్ ఈసారి సక్సెస్ టార్గెట్ గా ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. గత ఎక్స్పీరియన్స్ ల నుంచి లెసన్స్ నేర్చుకుని కంటెంట్, క్యాస్టింగ్, బడ్జెట్ మధ్య బ్యాలెన్స్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టార్ వాల్యూ కంటే కథకు, లెక్కలకు ఇంపార్టెన్స్ ఇస్తే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో సక్సెస్ పాజిబుల్ అవుతున్న ఫీలింగ్ తో ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ జాగ్రత్తలన్నీ రామ్‌ కు కమర్షియల్ హిట్‌ ను అందిస్తాయా? దర్శకుడిగా ఆయన తొలి ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? ఆ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.