Begin typing your search above and press return to search.

రామ్ 24 గంటల నాన్ స్టాప్ షూటింగ్.. ఎందుకంటే..

ఉస్తాద్ రామ్ పోతినేని ఇప్పుడు సెట్స్ లో డబుల్ డ్యూటీ చేస్తున్నాడు. RAPO23 ప్రాజెక్ట్ తో ఆయన డైరెక్టర్ గా కూడా మారుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   17 Aug 2026 5:46 PM IST
రామ్ 24 గంటల నాన్ స్టాప్ షూటింగ్.. ఎందుకంటే..
X

ఉస్తాద్ రామ్ పోతినేని ఇప్పుడు సెట్స్ లో డబుల్ డ్యూటీ చేస్తున్నాడు. RAPO23 ప్రాజెక్ట్ తో ఆయన డైరెక్టర్ గా కూడా మారుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రామ్ పడుతున్న కష్టం మామూలుగా లేదు. రీసెంట్ గా పాండిచ్చేరి శివార్లలో ఏకంగా 24 గంటల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కమిట్మెంట్ చూసి టీమ్ అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఒక హీరోగా సెట్స్ లోకి వెళ్లడం వేరు, దర్శకుడిగా వెళ్లడం వేరు. కానీ ఇక్కడ రామ్ హీరోగా నటిస్తూనే కెమెరా వెనక డైరెక్షన్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. జనరల్ గా షాట్ అయిపోగానే హీరోలు కారవాన్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ రామ్ కు ఆ ఛాన్స్ లేదు. తన పాత్రకు రెడీ అవుతూనే మానిటర్ చూసుకోవాలి, నెక్స్ట్ సీన్ కి ఆర్టిస్టులను సిద్ధం చేయాలి. కెమెరా వెనక ప్రతి ఫ్రేమ్ ను చెక్ చేసుకోవాలి.

డైరెక్టర్ గా రామ్ కు ఇదే ఫస్ట్ సినిమా అయినా మేకింగ్ లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. పాండిచ్చేరిలో ఈ సినిమా కోసం ఏకంగా ఒక భారీ సెటప్ వేశారు. దాదాపు తొమ్మిది రోజుల పాటు ఈ షెడ్యూల్ చాలా ఇంటెన్స్ గా సాగింది. ఒక పక్క నటుడిగా తనను తాను పుష్ చేసుకుంటూనే, ఇంకో పక్క డైరెక్టర్ గా సినిమాను ఒక పెద్ద స్కేల్ లో ప్రెజెంట్ చేయడానికి రామ్ గట్టిగానే శ్రమిస్తున్నాడు.

అయితే అనుకున్న ప్లాన్ అంతా సాఫీగా సాగలేదు. పాండిచ్చేరి షెడ్యూల్ లో సడన్ గా వర్షాలు పడటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. వాతావరణం అస్సలు సహకరించకపోవడంతో చేసేదేమీ లేక యూనిట్ మొత్తం ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో అనుకున్న షెడ్యూల్ లో కొన్ని సీన్స్ పెండింగ్ పడిపోయాయి. వర్షం వల్ల ఆగిపోయిన బ్యాలెన్స్ పార్ట్ ను కంప్లీట్ చేయడానికి టీమ్ మళ్లీ పాండిచ్చేరి వెళ్లబోతోంది.

ముందుగా వేసిన ఆ భారీ సెటప్ లోనే మిగిలిపోయిన సీన్స్ ను త్వరలోనే షూట్ చేయనున్నారు. ఇంత పెద్ద సెటప్ వేసినప్పుడు మధ్యలో ఇలాంటి బ్రేక్స్ రావడం ప్రొడక్షన్ కు కొంచెం టెన్షన్ తెచ్చే విషయమే అయినా, అవుట్ పుట్ విషయంలో మాత్రం రాజీ పడేది లేదని యూనిట్ ఫిక్స్ అయింది. ఈ ప్రాజెక్ట్ లో రామ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు, మిగతా క్యాస్టింగ్ ఏంటి అనే డీటెయిల్స్ రాబోయే రోజుల్లో బయటకు రానున్నాయి. తనకంటూ ఒక సాలిడ్ హిట్ కావాల్సిన టైమ్ లో, ఒకేసారి హీరోగా డైరెక్టర్ గా రామ్ తీసుకున్న ఈ రిస్క్ మామూలు విషయం కాదు. మరి రామ్ పడుతున్న ఈ కష్టం స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.