తనను తానే నిరూపించుకునేలా రామ్ ప్రయాణం!
ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో కెరీర్ గ్రాఫ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
By: Srikanth Kontham | 30 Jun 2026 5:32 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ కీలక మలుపులో ఉంది. `ఇస్మార్ట్ శంకర్` తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన రామ్ అటుపై రిలీజ్ అయిన వరుస చిత్రాలతో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో కెరీర్ గ్రాఫ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. నటుడిగా తనపై ఉన్న నమ్మకాన్ని, ప్రేక్షకుల్లో తగ్గిన క్రేజ్‌ను తిరిగి సంపాదించు కోవాలనే పట్టుదలతో రామ్ ప్రతిష్టాత్మకమైన `ర్యాపో 23` ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా రామ్ కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే? ఈ చిత్రానికి రామ్ హీరో మాత్రమే కాదు. తెర వెనుక దర్శకుడి బాధ్యతలు కూడా తీసుకున్నారు. వరుస వైఫల్యాలతో డీలా పడిన తరుణంలో మరెవరిపైనో ఆధారప డకుండా తనదైన శైలిలో సినిమాను మలచుకోవాలనే? రామ్ నిర్ణయం ఆయనలోని ధైర్యాన్ని సూచిస్తుంది. తనని తాను నిరూపించుకోవడానికి తనపై ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టుకోవడానికి రామ్ ఎంచుకున్న మార్గం ఇది. ఒక నటుడిగా ఆయనకిది పెద్ద అగ్నిపరీక్ష లాంటిదే. ప్రస్తుతం `ర్యాపో 23` షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎక్కడా రాజీ పడకుండా? ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా రామ్ ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యంగా గత చిత్రాల్లో లోపించిన కంటెంట్ బలాన్ని ఈ సినిమాలో ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. తనపై నమ్మకం ఉంచిన అభిమానులకు .. బాక్సాఫీస్ వద్ద స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రామ్ ఈ సినిమాను కంబ్యాక్ ఎపిక్ గా మార్చాలని శ్రమిస్తున్నారు. సెట్స్‌లో రామ్ చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే? `రాపో 23` ఖచ్చితంగా కొత్త రామ్‌ను పరిచయం చేస్తుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. సినిమా రంగంలో ఫ్లాపులు రావడం సహజం. కానీ ఆ ఫ్లాపుల నుండి బయటపడే విధానం హీరో స్థానాన్ని నిర్ణయిస్తుంది.
రామ్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఒక హీరో తన ఫెయి ల్యూర్స్‌ను పర్సనల్‌గా తీసుకుని తనని తాను సరిదిద్దుకోవడానికి ఇంతగా కష్టపడటం అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. కెరీర్ బాధ్యతను తన చేతుల్లోనే ఉంచుకుని తనని తాను నిరూపించుకునే ఈ ప్రయాణంలో రామ్ విజయం సాధిస్తే? మరోసారి బాక్సాఫీస్ వద్ద పవర్ ని నిరూపించుకున్నట్లే. ఈ విజయం యంగ్ హీరోలకు మంచి స్పూర్తిగా నిలుస్తుంది.
రామ్ పోతినేని చేస్తున్న ఈ సెల్ఫ్-ప్రూవింగ్ జర్నీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. `ర్యాపో 23` విజయం కేవలం నటుడిగా రామ్‌కు మాత్రమే కాదు. ఒక దర్శకుడిగా .. క్రియేటివ్ ఫోర్స్‌గా ఆయన పరిణతిని తెలియజేస్తుంది. ఎనర్జిటిక్ స్టార్‌గా మళ్ళీ ఫామ్‌లోకి రావడానికి రామ్ వేసిన ఈ అడుగులు ఎంత వరకు బాక్సాఫీస్ వద్ద ఫలిస్తాయో? తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
