Begin typing your search above and press return to search.

ఒక్కప్పుడు లవర్.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పోటీ.. నెగ్గేదెవరు?

మరి ఆ ఇద్దరు ఎవరు? వారు నటిస్తున్న చిత్రాలు ఏమిటి? ఏ చిత్రంపై ఎంత హైప్ ఉంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

By:  Madhu Reddy   |   10 Nov 2025 11:58 AM IST
ఒక్కప్పుడు లవర్.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పోటీ.. నెగ్గేదెవరు?
X

సాధారణంగా హీరోల మధ్య బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పోటీ ఒక హీరో, హీరోయిన్ మధ్య పోటీ నెలకొనడం కాస్త ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ఇద్దరు ఒకే సినిమాలో ప్రేమికులుగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఆ ఇద్దరే ఇప్పుడు సక్సెస్ కోసం ఆరాటపడడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారు. ఇద్దరు ఒకేరోజు విడుదలకు తమ సినిమాలను సిద్ధం చేస్తూ.. గట్టిగా పోటీ పడనున్నారు. మరి ఆ ఇద్దరు ఎవరు? వారు నటిస్తున్న చిత్రాలు ఏమిటి? ఏ చిత్రంపై ఎంత హైప్ ఉంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. 2016లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవి కిషోర్ నిర్మించిన చిత్రం 'నేను శైలజ'. ఇందులో రామ్ పోతినేని, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ చిత్రం కీర్తి సురేష్ కి తొలి తెలుగు చిత్రం కావడం గమనార్హం. ఇందులో ప్రేమికులుగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడు నవంబర్ 28న బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొంతకాలంగా రెడ్ , ది వారియర్, డబుల్ ఇస్మార్ట్ అంటూ వరుసగా డిజాస్టర్ లను చవి చూసిన రామ్ పోతినేని.. తాజాగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదల చేయగా.. మూడు పాటలు కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలోకి రాబోతోంది.

ఇదిలా ఉండగా మరొకవైపు మహానటి కీర్తి సురేష్ చివరిగా సుహాస్ తో కలిసి 'ఉప్పుకప్పురంబు' అనే సినిమా చేసి ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ 'రివాల్వర్ రీటా' తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చి నవంబర్ 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. లేడీ డాన్ గెటప్ లో కీర్తి సురేష్ నటిస్తుండగా.. జే.కే.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాషన్స్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న రామ్, కీర్తి సురేష్.. ఇద్దరిలో ఎవరు బాక్సాఫీస్ వద్ద నెగ్గుతారో చూడాలి.