Begin typing your search above and press return to search.

అప్పుడు ఆమె బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు భర్తతో

తొలి చిత్రం ‘దేవదాసు’తో బ్లాక్‌బస్టర్ కొట్టినప్పటికీ.. ఆ తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న టైంలో ‘రెడీ’తో భారీ విజయాన్ని అందుకున్నాడు.

By:  Garuda Media   |   28 Aug 2026 10:00 PM IST
అప్పుడు ఆమె బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు భర్తతో
X

యువ కథానాయకుడు రామ్ కెరీర్లో చాలా స్పెషల్ మూవీ.. రెడీ. తొలి చిత్రం ‘దేవదాసు’తో బ్లాక్‌బస్టర్ కొట్టినప్పటికీ.. ఆ తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న టైంలో ‘రెడీ’తో భారీ విజయాన్ని అందుకున్నాడు. అన్ని రసాలూ కలిసిన ఈ చిత్రం.. పెద్ద హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాల స్థాయిలో ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఈ చిత్రంలో తనతో జంట కట్టిన జెనీలియాకు రామ్ క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు.

ఆమెను తన లక్కీ ఛార్మ్‌గా భావిస్తాడు రామ్. ఇప్పటికీ జెన్నీతో రామ్ స్నేహం కొనసాగుతోంది. ఆ స్నేహంతోనే జెన్నీ భర్త రితేష్ దేశ్‌ముఖ్‌కు తెలుగు సినిమాలో అవకాశం కల్పించాడట రామ్. ఈ ఎనర్జటిక్ స్టార్ కెరీర్లో తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ‘లోన్ వూల్ఫ్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమా చిత్రీకరణ కోసమే రితేష్ ఇటీవలే హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో రితేష్‌ది నెగెటివ్ రోల్ అని సమాచారం. కొంచెం సైకో లక్షణాలతో ఆ పాత్ర ఉంటుందట. ఇలాంటి పాత్రను రితేష్ బాగా చేయగలడని ‘ఏక్ విలన్’ సినిమాతోనే రుజువైంది. ఒక దశలో రితేష్ కెరీర్ ముగిసిపోతున్న సంకేతాలు కనిపించాయి కానీ.. స్వీయ దర్శకత్వంలో రూపొందిన మరాఠీ చిత్రం ‘వేద్’ (మజిలీ రీమేక్)తో భారీ విజయాన్నందుకున్నాడు.

ఈ ఏడాది దర్శకుడిగా ఛత్రపతి శివాజీ పాత్రలో నటిస్తూ తీసిన సినిమా కూడా ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. బాలీవుడ్లో అతడికి అవకాశాలకు లోటేమీ లేదు. ఇలాంటి టైంలో తొలిసారిగా నటించబోతున్నాడు రితేష్. ఈ చిత్రాన్ని రామ్ సొంత బేనర్లో నిర్మిస్తుండడం విశేషం. తన సోదరుడే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండగా.. బడ్జెట్ రూ.100 కోట్లని వార్తలు వస్తున్నాయి. ఇందులో రామ్ డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌తో సాగే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.