Begin typing your search above and press return to search.

రామ్ పోతినేని నెక్స్ట్.. ప్లాన్ మామూలుగా లేదు..

ఆ సినిమాను రాపో సినిమాటిక్స్ బ్యానర్‌ పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. కృష్ణ పోతినేని సమర్పిస్తున్న ఆ ప్రాజెక్ట్‌ కు సంగీత దర్శకుడిగా సామ్ సీఎస్ పని చేస్తున్నారు.

By:  M Prashanth   |   19 May 2026 10:00 PM IST
రామ్ పోతినేని నెక్స్ట్.. ప్లాన్ మామూలుగా లేదు..
X

టాలీవుడ్‌ ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ పోతినేని నటుడిగా, గాయకుడిగా, లిరిసిస్ట్‌ గా ఇప్పటికే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోగా.. ఇప్పుడు దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానుండడం హాట్ టాపిక్‌ గా మారింది. తన అప్ కమింగ్ RAPO 23 సినిమాతో ఆయన మెగా ఫోన్ పట్టబోతున్నారు. దీంతో ఆ ప్రాజెక్ట్‌ పై అభిమానుల్లోనే కాదు.. సినీ ప్రియుల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది.

ఆ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే ను కూడా రామ్ స్వయంగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించిన రామ్.. ఈసారి మాత్రం స్టైలిష్ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌ ను ఎంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలుగులో అరుదుగా వచ్చే ఆ తరహా కథను రామ్ తన డెబ్యూ డైరెక్షన్ చిత్రంగా సెలెక్ట్ చేసుకోవడం చూస్తుంటే.. సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌ కు భిన్నంగా ఏదో కొత్త ప్రయోగం చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమాలో రామ్ వీర పాత్రలో కనిపించనున్నారు. ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్ అనే ట్యాగ్‌ లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒంటరిగా పోరాడే వ్యక్తి మానసిక సంఘర్షణ, అతని జీవితంలో జరిగే అనూహ్య పరిణామాల చుట్టూ కథ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాక్షన్‌ తో పాటు ఎమోషనల్ డెప్త్ ఉండేలా స్క్రిప్ట్ రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

ఆ సినిమాను రాపో సినిమాటిక్స్ బ్యానర్‌ పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. కృష్ణ పోతినేని సమర్పిస్తున్న ఆ ప్రాజెక్ట్‌ కు సంగీత దర్శకుడిగా సామ్ సీఎస్ పని చేస్తున్నారు. బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ లో తనదైన ముద్ర వేసే సామ్.. సైకాలజికల్ థ్రిల్లర్‌ కు మరో మెయిన్ అసెట్! ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ లోనే విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఇక ఆ చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీర పాత్రకు జోడీగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగాయని, శ్రీనిధి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

మరోవైపు విలన్ పాత్ర కోసం కూడా సరైన నటుడిని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు కీలక పాత్ర కోసం మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్ పేరును పరిశీలించినట్లు సమాచారం. క్యాస్టింగ్ ఎంపికలను చూస్తుంటే.. రామ్ ప్రాజెక్ట్‌ ను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని అర్థమవుతోంది.

ఇటీవల రామ్‌ కు ఆశించిన స్థాయిలో విజయాలు రాకపోవడంతో.. ఇప్పుడు గట్టి కమ్‌ బ్యాక్ కోసం ఆయన స్ట్రాంగ్ ప్లాన్‌ తో ముందుకు వెళ్తున్నట్లు అర్థమవుతుంది. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ముద్ర వేయాలనే లక్ష్యంతో RAPO23ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. కథ, టెక్నికల్ టీమ్, క్యాస్టింగ్.. అన్నింటిని పరిశీలిస్తే రామ్ ప్లాన్ నిజంగానే మామూలుగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.