Begin typing your search above and press return to search.

చరణ్ పై ప్రెజర్.. రామ్ కామెంట్స్ లాజిక్ ఉందబ్బా..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చిరంజీవి, చరణ్ మీద చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

By:  Ramesh Boddu   |   21 Oct 2025 11:01 AM IST
చరణ్ పై ప్రెజర్.. రామ్ కామెంట్స్ లాజిక్ ఉందబ్బా..!
X

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చిరంజీవి, చరణ్ మీద చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన దేవదాస్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక చిరంజీవి గారికి స్పెషల్ స్క్రీనింగ్ చేశాం ఆ టైం లో చరణ్ కూడా వచ్చాడు. ఐతే అప్పుడు చిరంజీవి లాంటి తండ్రి ఉంటే బాగుండేది తనకు కూడా మంచి లాంచింగ్ ఉండేది అనుకున్నా.. కానీ ఆ తర్వాత చరణ్ పై ఉన్న ప్రెజర్ చూసి బాధపడ్డా.. ఫాదర్ లెగసీని కొనసాగించడానికి చరణ్ చాలా కష్టపడాలి అందుకే చరణ్ విషయంలో బాధకలిగిందని అన్నారు.

చిరంజీవి తనయుడిగా ఎంట్రీ బాగానే ఉంటుంది కానీ..

చాలా మంది స్టార్ కిడ్ కదా తనకేంటి అని అంటున్నారు. కానీ ఆ ప్రెజర్ ఆ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి రామ్ అర్ధం చేసుకోగలిగాడని నెటిజెన్లు అంటున్నారు. చిరంజీవి తనయుడిగా ఎంట్రీ బాగానే ఉంటుంది కానీ తండ్రి స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఐతే ఆ విషయంలో చరణ్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. రామ్ కూడా తను చిరంజీవి లాంటి ఫాదర్ ఉంటే తనకు కూడా మంచి లాంచింగ్ ఉండేదని ఫీల్ అయ్యాడట. కానీ ఆ తర్వాత అప్పుడు ఉండే ప్రెజర్ చూసి షాక్ అయ్యాడని తెలుస్తుంది.

రామ్ నెక్స్ట్ ఒక సినిమాను డైరెక్ట్ కూడా చేస్తానని అంటున్నాడు. ప్రస్తుతం రామ్ నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో ఒక సాంగ్ రాశాడు.. ఒక సాంగ్ పాడాడు. సినిమాలో నటించడమే కాదు సినిమాకు సంబందించిన విషయాల్లో కూడా రామ్ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇక నెక్స్ట్ తను ఒక కథ రాసుకున్నానని ఫ్యూచర్ లో డైరెక్షన్ కూడా చేస్తానని అంటున్నాడు రామ్.

రామ్ ఆ కేటగిరిలో సత్తా చాటాలని..

కన్నడలో ఎలా అయితే యాక్టర్ కం డైరెక్షన్ చేస్తూ అదరగొడతారో తెలుగులో అలాంటి వాళ్లు చాలా అరుదు. మరి రామ్ ఆ కేటగిరిలో సత్తా చాటాలని చూస్తున్నాడని అనిపిస్తుంది. రామ్ డైరెక్షన్లో సినిమా అంటూ చేస్తే హీరోగా ఎవరిని తీసుకుంటాడు.. అతనే చేస్తాడా లేదా వేరే ఎవరినైనా తీసుకుంటాడా అంటూ డిస్కషన్ చేస్తున్నారు.

రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ చివర్లో రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రామ్, భాగ్య శ్రీ జోడీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.