Begin typing your search above and press return to search.

రామ్ పోతినేని.. ఫ్యాన్స్ రిక్వెస్ట్ వింటారా?

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి ఉన్న ఇమేజే వేరు. సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన టాలెంట్ తో మాత్రం ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు.

By:  M Prashanth   |   12 Dec 2025 2:00 PM IST
రామ్ పోతినేని.. ఫ్యాన్స్ రిక్వెస్ట్ వింటారా?
X

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి ఉన్న ఇమేజే వేరు. సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన టాలెంట్ తో మాత్రం ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు. కెరీర్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ స్పెషల్ ఫేమ్ ను సొంతం చేసుకున్నారు. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా ఎనర్జీతోనే కనిపిస్తుంటారు.

అయితే రామ్.. హిట్ అందుకుని చాలా కాలం అయింది. వరుస సినిమాల్లో నటిస్తూ.. థియేటర్స్ లో సందడి చేస్తున్నా.. హిట్ దొరకడం లేదు. మంచి కమ్ బ్యాక్ ఇద్దామని ట్రై చేసినా కుదరడం లేదు. రీసెంట్ గా ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్.. భారీ హిట్ ను సొంతం చేసుకుంటారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు.

ఆ సినిమాకు రివ్యూలు పాజిటివ్ గానే వచ్చినా.. అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేదు. మూవీ బాగుందని అంతా చెబుతున్నా.. మూడు వారాలకే థియేట్రికల్ రన్ ను క్లోజ్ చేసుకుంది. దీంతో సినిమా ఆడియన్స్ ను రీచ్ అవ్వలేదని చెప్పాలి. దీంతో మళ్లీ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో రామ్ పోతినేనికి నిరాశే ఎదురైంది.

అయితే ఇప్పుడు అసలు రామ్ ఎందుకు కమ్ బ్యాక్ ఇవ్వలేకపోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. అందుకు ముఖ్య కారణం సినిమా సెలెక్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే రామ్.. తనకు సూట్ అయ్యే జోనర్ కు కొన్నేళ్ల క్రితం దూరమయ్యారు. ఆయనకు లవ్ జోనర్ మూవీస్ బాగా సెట్ అవుతాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఆ జోనర్ లో ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు.. ఆడియన్స్ ను అలరించాయి. మంచి హిట్స్ గా కూడా నిలిచాయి. అందులో నేను శైలజ వంటి వివిధ చిత్రాలు ఉన్నాయి. కానీ రామ్ మాత్రం.. తనకు సెట్ కాని జోనర్స్ లోకి వెళ్తున్నారు. మాస్ జోనర్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో.. అటు వైపు మొగ్గు చూపుతూ వచ్చారు.

కానీ ఆ మూవీ తప్ప.. స్కంద, వారియర్, రెడ్, డబుల్ ఇస్మార్ట్ వంటి ప్రయోగాత్మక సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టాయి. రామ్ కెరీర్ లో డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఏకంగా హారర్ మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రయోగాలు వద్దని సూచిస్తున్నారు. లవ్ జోనర్ ను సెలెక్ట్ చేసుకోమని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి అభిమానుల అభిప్రాయాలను రామ్ వింటారో లేదో చూడాలి.