రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!
2008లో విడుదలైన ‘రెడీ’ సినిమాతో ఏర్పడిన రామ్ పోతినేని, జెనీలియా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. జెనీలియా భర్త రితేశ్ దేశ్ముఖ్తోనూ రామ్‌కు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో రితేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన తెలుగు తెరకు పరిచయం కానున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో రితేశ్, జెనీలియా కుటుంబానికి రామ్ వీడ్కోలు పలికిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 8 Nov 2026 12:02 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కోసం కలిసి పనిచేసిన హీరో, హీరోయిన్లు ఆ తర్వాత కూడా మంచి స్నేహితులుగా కొనసాగడం అరుదుగా కనిపిస్తుంది. అయితే రామ్ పోతినేని, జెనీలియా మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా రెడీ ఒక్కటే అయినప్పటికీ, అప్పటి నుంచి కొనసాగుతున్న పరిచయం ఇప్పటికీ అలాగే ఉంది. తాజాగా ఈ ఇద్దరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం మరోసారి వార్తల్లో నిలిచింది.
రామ్ పోతినేని, జెనీలియా కలిసి రెడీ సినిమాలో నటించారు. 2008లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రామ్, జెనీలియా జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా మంచి స్నేహంగా మారింది. ఆ తర్వాత జెనీలియా తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ రామ్‌తో తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న తర్వాత జెనీలియా ఎక్కువగా కుటుంబ జీవితానికే సమయం కేటాయిస్తున్నారు. కానీ తెలుగు హీరో రామ్ తో ఉన్న స్నేహం మాత్రం.. జెనీలియా ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు. జెనీలియా నే కాకుండా జెనీలియా ఫ్యామిలీతో కూడా రామ్ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఇప్పుడు ఈ పరిచయం సినిమా వరకు వెళ్లింది.
రామ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కొత్త తెలుగు సినిమాలో రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో రితేశ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఇందులో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి.
తాజాగా ముంబై విమానాశ్రయంలో రామ్ కనిపించారు. రితేశ్, జెనీలియా, వారి పిల్లలు విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న సమయంలో రామ్ కూడా అక్కడ కనిపించాడు. ఈ సందర్భంగా రామ్, జెనీలియా కుటుంబాలు కలిసి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మీద స్నేహం ఇప్పటికీ కూడా ఇంత స్ట్రాంగ్ గా కొనసాగదాన్ని తెగ ప్రశంసిస్తున్నారు అభిమానులు.
