Begin typing your search above and press return to search.

వైల్డ్ మోడ్‌.. ఏం ప్లాన్ చేస్తున్నావు రామ్?

పుట్టినరోజు సందర్భంగా మే 15 ఉదయం 10:08 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

By:  M Prashanth   |   14 May 2026 12:22 PM IST
వైల్డ్ మోడ్‌.. ఏం ప్లాన్ చేస్తున్నావు రామ్?
X

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హై వోల్టేజ్ వైబ్ క్రియేట్ చేశారు. ఈ లేటెస్ట్ పోస్టర్ చూస్తుంటే రామ్ ఈసారి గతంలో ఎన్నడూ చూడని ఒక వైల్డ్ అండ్ రా లుక్‌లో కనిపించబోతున్నారని అర్ధమవుతుంది.

పుట్టినరోజు సందర్భంగా మే 15 ఉదయం 10:08 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. వరుసగా మాస్ ప్రయత్నాలు చేస్తున్నా, ఈసారి రామ్ ఎంచుకున్న సబ్జెక్ట్ మాత్రం చాలా స్పెషల్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. విడుదలైన పోస్టర్ లో రక్తంతో తడిసిన ఒక మైక్ ఇందులో హైలెట్ గా కనిపిస్తోంది. మైక్ అనేది ఒక వాయిస్‌ని వినిపించడానికి వాడే సాధనం, కానీ అది రక్తంతో ఉండటం వెనుక ఏదో బలమైన కారణం ఉందనిపిస్తోంది.

సినిమా టైటిల్ లేదా కథలోని కీలకమైన పాయింట్‌ను ఈ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ లేదా పవర్ ఫుల్ ఎమోషన్ ఉండే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఈ వైల్డ్ అవతారం రామ్ కెరీర్‌లో ఒక కొత్త రకమైన మేకోవర్ అని చెప్పాలి. మరో టాక్ ఏమిటంటే.. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ కేవలం హీరో మాత్రమే కాదు, కథా రచయిత కూడా.

గత కొంతకాలంగా తన సినిమాల మేకింగ్‌లో యాక్టివ్ గా ఉంటున్న రామ్, ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి డైరెక్షన్ కూడా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం ఇండస్ట్రీలో గట్టిగా సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోగా రామ్ మరో రికార్డ్ అందుకుంటాడు. తన స్ట్రెంత్స్ ఏంటో తనకు బాగా తెలుసు కాబట్టి, ఆడియన్స్ తన నుంచి ఏం ఆశిస్తున్నారో అదే పంథాలో ఈ సినిమాను ప్లాన్ చేశారట.

ఒక హీరో తన కథను తనే దగ్గరుండి చూసుకోవడం అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో రామ్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. రామ్ గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అందుకే ఈసారి రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా, ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమా కోసం రామ్ తన లుక్ మీద కూడా భారీగానే వర్కవుట్ చేస్తున్నట్లు సమాచారం.

తన సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ మీద సోదరుడు కృష్ణ చైతన్య నిర్మించబోతున్న ఈ సినిమా, టెక్నికల్ గా కూడా హై స్టాండర్డ్స్ లో ఉండేలా చూసుకుంటున్నారట. పాత రకమైన కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి, కంప్లీట్ గా కొత్త విజన్ తో రామ్ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక రామ్ బర్త్ డే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. రేపు ఉదయం రాబోయే అనౌన్స్‌మెంట్ తో సినిమా టైటిల్ తో పాటు, దర్శకుడు ఎవరనే దానిపై ఉన్న సస్పెన్స్ కూడా వీడనుంది.