నిన్న భాగ్యశ్రీ.. నేడు రామ్.. రూమర్స్ పై క్లారిటీ
తాను ఎవరితో లవ్ లో లేనని ఇప్పటికే చెప్పిన ఆమె.. రీసెంట్ గా రామ్ తో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని వెల్లడించారు.
By: M Prashanth | 25 Nov 2025 5:05 PM ISTటాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే మధ్య ఏదో సమ్ థింగ్ ఉందని ఎప్పటి నుంచో రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ఇప్పుడు కలిసి చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ షూటింగ్ టైమ్ లో ప్రేమలో పడ్డారని.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తలపై భాగ్యశ్రీ ఇటీవల క్లారిటీ ఇచ్చి.. అవన్నీ రూమర్స్ అని పరోక్షంగా తేల్చేశారు. తాను ఎవరితో లవ్ లో లేనని ఇప్పటికే చెప్పిన ఆమె.. రీసెంట్ గా రామ్ తో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని వెల్లడించారు. ఆయన చాలా హర్డ్ వర్కర్ అంటూ కొనియాడారు. అంతే కాదు.. తాను రామ్ ను ఆరాధిస్తానని కూడా చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్ రూమర్స్ పై స్పందించారు రామ్. తాను ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ కోసం ఒక లవ్ సాంగ్ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయని తెలిపారు. మనసులో ఏమీ లేకపోతే అంత గొప్పగా పాట ఎలా రాయగలరని అందరూ అనుకున్నారని రామ్ చెప్పుకొచ్చారు.
కానీ తాను కేవలం సినిమాలోని హీరో, హీరోయిన్ పాత్రలను ఇమేజిన్ చేసుకుని లిరిక్స్ రాశానని తెలిపారు. అయితే అసలు ఆ పాట రాసినప్పటికి హీరోయిన్ ను ఇంకా సెలెక్ట్ కూడా చేయలేదని చెప్పారు. అలా పరోక్షంగా రిలేషన్ షిప్ రూమర్స్ ను తోసిపుచ్చారు. ప్రస్తుతం రామ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే అదే ఇంటర్వ్యూలో తన గత మూవీ డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గురించి కూడా మాట్లాడారు. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అయినా.. రిజల్ట్ మాత్రం అనుకున్నట్లు రాలేదని తెలిపారు. సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయని చెప్పిన రామ్.. అవి ఆడియన్స్ ను కనెక్ట్ అవ్వలేదని, అందుకే రిజల్ట్ అలా వచ్చిందని పేర్కొన్నారు.
అయితే ఏ హీరో అయినా.. హీరోయిన్ అయినా.. సక్సెస్ అందుకోవాలంటే రెండు రీజన్స్ ఉండాలని తెలిపారు రామ్. ముఖ్యంగా ఎవరికి వారు తాము చేసే వర్క్ పై చాలా కాన్సంట్రేషన్ ఉండాలని అన్నారు. అంతే కాదు.. దాని కోసమే పుట్టామేమో అనిపించేలా చాలా హార్ట్ వర్క్ చేయాలని చెప్పారు. ఆ రెండు తనలో ఉన్నాయని చెప్పిన రామ్.. ఎప్పటికైనా భారీ విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని తెలిపారు. మరి ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
