భాగ్యశ్రీ గురించే ఎక్కువ మాట్లాడాడేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఇంకా పెళ్లి కాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. చాలామంది సహచరులు పెళ్లితో లైఫ్ లో సెటిలయ్యారు.
By: Sivaji Kontham | 22 Nov 2025 11:19 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఇంకా పెళ్లి కాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. చాలామంది సహచరులు పెళ్లితో లైఫ్ లో సెటిలయ్యారు. కానీ అతడు ఇంకా సోలోగానే ఉన్నాడు. అతడు సినిమా తర్వాత సినిమా చేస్తున్నాడు కానీ, పెళ్లి మాటే ఎత్తడం లేదు. అయితే గత కొంతకాలంగా `ఆంధ్రా కింగ్ తాలూకా` హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఏదైనా సినిమాలో కలిసి నటించే జంటపై ఇలాంటి కామెంట్లు సహజమే అనుకున్నా.. ఇప్పుడు `ఆంధ్రా కింగ్ తాలూకా` వైజాగ్ ఈవెంట్లో రామ్ ప్రత్యేకించి భాగ్యశ్రీపై ఫోకస్ చేస్తూ, తన మనసును బయటపెట్టాడు.
వేదిక వద్ద ఎందరు ఉన్నా, అతడు భాగ్యశ్రీపై ఫోకస్ చేసినంతగా ఇతరులపై చేయలేదు అని అందరికీ అర్థమవుతూనే ఉంది. భాగ్యశ్రీ పేరును తలచుకుంటూ పదే పదే పొగిడేసాడు రామ్. భాగ్యశ్రీ ని కథానాయికగా ఎంపిక చేసుకున్నప్పుడు మొదట గ్లామరస్ డాళ్ అనుకున్నామని, కానీ తనలో పెర్ఫామర్ ని చూసి ఆశ్చర్యపోయాని అన్నాడు. తెలుగు ఇండస్ట్రీకి చాలా ఏళ్ల తర్వాత గ్లామర్ తో పాటు, పెర్ఫామెన్స్ తో మెప్పించే నటి వచ్చిందన్నాడు. ఈ సినిమాతో చాలా అఛీవ్ చేసింది భాగ్యశ్రీ. అవార్డులు నీకోసం ఎదురు చూస్తున్నాయి భాగ్యశ్రీ... అంటూ పదే పదే భాగ్యశ్రీ పేరునే తలుచుకున్నాడు.
ఇక వేదిక దిగువన రామ్ నే చూస్తూ కూచున్న భాగ్యశ్రీ చాలా సిగ్గుల మొగ్గవుతూ కృతజ్ఞతా భావంతో చూసింది. ఓవైపు రామ్ ఫీలింగ్స్, మరోవైపు భాగ్య శ్రీ ఫీలింగ్స్ ని చూస్తూ వైజాగ్ అభిమానులు కూడా తన్మయంలో మునిగిపోయారు. మొత్తానికి విశాఖ ఆర్కే బీచ్ లో ఈవెంట్ ఒక అందమైన జంటను చూసి తెగ మురిసిపోయింది.
రామ్ - భాగ్య శ్రీ జంట ఎంతో అందమైన జంట. ఈ జోడీ తెరపైనే కాదు, నిజ జీవితంలోను అంతే ముద్దొచ్చేస్తుంది! అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు. ఈ కెమిస్ట్రీ చూస్తుంటే, ఆంధ్రా కింగ్ తో భాగ్యశ్రీ రొమాన్స్ బాగానే కుదిరిందని భావించాలి. రామ్ ఈసారి కచ్ఛితంగా హిట్టు కొడతాడేమో అనిపిస్తోంది. నవంబర్ 27 రిలీజ్ అంటూ ప్రకటించారు గనుక ఈ ఐదు రోజులు ఆగితే ఫలితం ఏదో ఒకటి తేల్తుంది. ఈ చిత్రానికి మహేష్ పి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
