రామ్ పోతినేని–భాగ్యశ్రీ బోర్సే.. లవ్ లేదు, బ్రేకప్ లేదు, ప్యాచ్‌అప్ లేదు!
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే మళ్లీ కలిశారంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది.
By: M Prashanth | 27 Oct 2026 12:14 PM ISTరామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే మళ్లీ కలిశారంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఇద్దరూ ఒకే రెస్టారెంట్‌లో ఉన్నట్లు కొన్ని ఫొటోలను పక్కపక్కన పెట్టి ప్యాచ్‌అప్ జరిగిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఫొటోలు ఇప్పటివి కావు. 'ఆంధ్రా కింగ్ తాలూకా' షూటింగ్, ప్రమోషన్స్ సమయంలో బయటకొచ్చిన పాత పోస్టులనే మళ్లీ ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. అప్పట్లోనే వీళ్లిద్దరి పేర్లతో వచ్చిన ప్రేమ వార్తలు ఇప్పుడు మరోసారి మొదలయ్యాయి.
ముఖ్యంగా భాగ్యశ్రీ తెల్లటి టాప్‌లో రెస్టారెంట్‌లో కూర్చున్న ఫొటో గత ఏడాది ఆగస్టు నాటిదే. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటో షేర్ చేసింది. పిజ్జా తినడం గురించి సరదాగా క్యాప్షన్ కూడా పెట్టింది. ఇప్పుడు ఆ ఫొటోను రామ్ రెస్టారెంట్ ఫొటోతో కలిపి ఇద్దరూ ఒకేచోట ఉన్నారనే ప్రచారం మొదలుపెట్టారు. అయితే రెండు ఫొటోలూ ఒకే సమయంలో తీసినవని చెప్పడానికి స్పష్టమైన సమాచారం లేదు.
ఇలాంటి పోలికలు 'ఆంధ్రా కింగ్ తాలూకా' షూటింగ్ టైమ్‌లోనూ వచ్చాయి. రామ్, భాగ్యశ్రీ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో పెట్టిన కొన్ని ఫొటోల బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉండటంతో డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. అప్పట్లో భాగ్యశ్రీ వేలికి ఉన్న ఉంగరం కూడా వైరల్ అయింది. అది ఎవరు ఇచ్చారంటూ అభిమానులు అడిగితే తానే కొనుక్కున్నట్లు భాగ్యశ్రీ సమాధానం ఇచ్చింది. అయినా ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మాత్రం ఆగలేదు.
ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరూ కలిసి కనిపించడం, అమెరికా వెళ్లడం కూడా ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. ముఖ్యంగా రామ్ స్వయంగా రాసిన 'నువ్వుంటే చాలు' పాటను భాగ్యశ్రీ కోసమే రాశారంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే ఆ పాట రాసే సమయానికి హీరోయిన్ ఎంపిక కూడా పూర్తికాలేదని రామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భాగ్యశ్రీతో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఖండించారు.
భాగ్యశ్రీ సైతం రామ్ తనకు మంచి స్నేహితుడని గతంలోనే చెప్పింది. 'ఆంధ్రా కింగ్ తాలూకా'లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో బయట కూడా ప్రేమలో ఉన్నారంటూ ఊహించుకున్నారని వివరించింది. ఇప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి కొత్తగా ఎక్కడా కనిపించలేదు. ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయినప్పటికీ పాత రెస్టారెంట్ ఫొటోలతో మళ్లీ ప్యాచ్‌అప్ వార్తలు రావడం గమనార్హం.
ఇక 'ఆంధ్రా కింగ్ తాలూకా' విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ప్రస్తుతం రామ్ తన కొత్త సినిమా పనుల్లో ఉండగా, భాగ్యశ్రీ కూడా వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా కూడా ప్రకటించలేదు. గతంలో షూటింగ్ సమయంలో వచ్చిన ఫొటోలు, ప్రమోషన్స్‌లో జరిగిన సరదా ముమెంగా ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. వాటికి ఇప్పుడు ప్యాచ్‌అప్ అనే కొత్త పేరు జోడించారు. మరి ఈ రూమర్స్ డోస్ కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.
