భాగ్యశ్రీతో రూమర్లు.. రామ్ క్లారిటీ ఇస్తారా?
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 11 Sept 2025 10:15 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ చేస్తుండగా.. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు వారిద్దరూ ఎక్కడా బహిరంగంగా కనిపించకపోయినా.. కూడా రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఒకే బ్యాక్ గ్రౌండ్ ఉన్న పిక్స్ పెడుతున్నారని.. అందుకే ఇద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు అనిపిస్తోందని అనేక మంది సోషల్ మీడియాలో కొన్ని వారాలుగా కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారని కనుక.. ఒకే ప్లేస్ లోనే షూటింగ్ నిమిత్తం ఉంటారు. కాబట్టి అక్కడి బ్యాక్ గ్రౌండ్ తోనే పిక్స్ పెడుతుంటారు. అది వాస్తవమే.. కానీ రూమర్స్ మాత్రం స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం భాగ్యశ్రీ.. లవ్ రూమర్స్ పై పరోక్షంగా స్పందించి క్లారిటీ కూడా ఇచ్చారు.
ఓ పిక్ లో ఆమె చేతికి రింగ్ కనిపించగా.. కొందరు నెటిజన్లు ఆ రింగ్ ఎవరు తొడిగారు మేడమ్ అంటూ కామెంట్స్ పెట్టారు. దానికి ఆమె తానే కొనుక్కున్నానంటూ క్లారిటీ ఇచ్చారు. రామ్ తో వస్తున్న డేటింగ్ వార్తల్లో ఎటువంటి నిజం లేదని పరోక్షంగా వెల్లడించారు. రామ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
అయితే రామ్, భాగ్యశ్రీ నటిస్తున్న ఆంధ్రాకింగ్ తాలూకా మూవీ నవంబర్ 28వ తేదీన రిలీజ్ కానుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి.మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చివరి దిశలో ఉండగా.. మేకర్స్ మరికొద్ది రోజుల్లో గుమ్మడికాయ కొట్టనున్నారు.
అదే సమయంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు. అయితే సరైన కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న రామ్.. సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో భాగ్యశ్రీతో డేటింగ్ రూమర్స్ పై స్పందిస్తారో లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి రామ్ పోతినేని ఏం చేస్తారో.. క్లారిటీ ఇస్తారో లేదో అనేది వేచి చూడాలి.
