కొత్త డైరెక్టర్ తో రాపో ప్రయోగం?
రామ్ పోతినేని. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్‌సమ్ అండ్ టాలెంటెడ్ హీరో. అతని అందం, యాక్టింగ్, డ్యాన్సులు ఇలా ప్రతీ దాంట్లోనూ రామ్ కు టాలెంట్ ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 2 Sept 2025 4:10 PM ISTరామ్ పోతినేని. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్‌సమ్ అండ్ టాలెంటెడ్ హీరో. అతని అందం, యాక్టింగ్, డ్యాన్సులు ఇలా ప్రతీ దాంట్లోనూ రామ్ కు టాలెంట్ ఉంది. కానీ అన్నీ ఉన్నా సరైన స్టోరీ సెలెక్షన్ తెలియక కెరీర్ మొదటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రామ్ ఆఖరిగా బ్లాక్ బస్టర్ అందుకున్నది పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో.
ఇస్మార్ట్ శంకర్ తో ఆఖరి హిట్
ఆ సినిమా తర్వాత రామ్ చాలానే సినిమాలు చేశారు. కానీ అవేవీ అతనికి హిట్ ను అందించలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్లుగా నిలిచాయి. సరైన కథలు ఎంపిక చేసుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం వల్ల తన ప్రైమ్ టైమ్ మొత్తాన్ని రామ్ వేస్ట్ చేసుకుంటున్నారని ఆయన ఫ్యాన్స్ తెగ బాధ పడుతున్నారు.
మాస్ కోసం పరుగులెత్తి..
ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రామ్, ఆ క్రేజ్ ను కాపాడుకోవాలని అదే మాస్ సినిమాలపై ఫోకస్ చేయడంతో ప్రతీసారీ ఫెయిల్ అవుతూనే వచ్చారు. దీంతో ఇక రూట్ మార్చాల్సిందే అని డిసైడ్ అయ్యి, తనకు బాగా సూటయ్యే లవర్ బాయ్ గెటప్ లోకి వచ్చేసి ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాను చేస్తున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్.
నవంబర్ 28న ఆంధ్రా కింగ్ తాలూకా
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి. మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఆంధ్రా కింగ్ తాలూకాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా ఈ మూవీ నవంబర్ 28న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ ఎవరితో సినిమా చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో దానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
రామ్ నెక్ట్స్ ఏంటంటే..
కిషోర్ గోపు అనే డెబ్యూ డైరెక్టర్ తో రామ్ తన నెక్ట్స్ మూవీని చేయనున్నారని, ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి రానా దగ్గుబాటి నిర్మించనున్నారని, జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా ఒక మిస్టిక్ థ్రిల్లర్ గా, బ్లాక్ మ్యాజిక్, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందనుందని వార్తలొస్తున్నాయి.
