Begin typing your search above and press return to search.

ఇదో సరికొత్త ప్రమోషన్.. భాగ్యశ్రీ బాగానే ప్లాన్ చేసిందే?

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్లో తెరకెక్కిన తాజా మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా.. నవంబర్ 28న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు చిత్ర యూనిట్.

By:  Madhu Reddy   |   13 Oct 2025 12:43 PM IST
ఇదో సరికొత్త ప్రమోషన్.. భాగ్యశ్రీ బాగానే ప్లాన్ చేసిందే?
X

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్లో తెరకెక్కిన తాజా మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా.. నవంబర్ 28న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు చిత్ర యూనిట్. మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.అయితే స్కంద, ది వారియర్ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు రామ్ పోతినేని. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్న రామ్ పోతినేని కష్టాన్ని పొగుడుతూ.. భాగ్యశ్రీ పెట్టిన తాజా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆకర్షిస్తోంది. అంతేకాదు భాగ్య శ్రీ కొత్తరకం ప్రమోషనల్ స్ట్రాటజీ అంటూ ఆమె పెట్టిన పోస్టులకు కామెంట్లు పెడుతున్నారు.

భాగ్యశ్రీ పెట్టిన పోస్ట్ ఏంటి అనేది చూస్తే.. తాజాగా భాగ్యశ్రీ బోర్సే తన సోషల్ మీడియా ఖాతాలో రామ్ పోతినేని సినిమా కోసం ఎంత కష్టపడి పని చేశారో తన పోస్టులో పేర్కొంది.. "ప్రియమైన రామ్.. సాగర్ పాత్రలో మీరు చేసే మ్యాజిక్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు వేచి ఉండలేకపోతున్నారు. మీరు ఈ సినిమా కోసం చేసిన కృషి, హార్డ్ వర్క్ కి నేను ఆశ్చర్యపోతున్నాను. ఆంధ్రా కింగ్ తాలూకా మీ అభిమానుల అతిపెద్ద విజయం" అంటూ పోస్ట్ పెట్టింది. అయితే భాగ్యశ్రీ బోర్సే రామ్ పోతినేని సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో ఒకే ఒక్క పోస్ట్ తో స్పష్టం చేసింది. అలా రామ్ పోతినేని కష్టాన్ని అభివర్ణిస్తూ భాగ్యశ్రీ తన సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టు చూసి.. ఇదో కొత్త రకం స్ట్రాటజీ అంటూ సోషల్ మీడియా జనాలు కామెంట్లు పెడుతున్నారు.

రామ్ పోతినేని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు..ఆయన కష్టాన్ని గుర్తించడం కోసమైనా సరే ఈ సినిమాని చూడాలి అన్నట్లుగా కొత్తరకం ప్రమోషన్స్ తో సినిమా చూడాలి అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటివరకు హీరోయిన్లు ఎవరూ కూడా ఇలాంటి పోస్టులు సినిమా విడుదలకు ముందు పెట్టలేదు. సినిమా హిట్ అయ్యాక హీరో,డైరెక్టర్ కష్టాలను పొగుడుతూ పోస్టులు పెడతారు. కానీ సినిమా విడుదలకు ముందే ఇలా ఎవరు పొగడరు. కానీ భాగ్యశ్రీ బోర్సే మాత్రం సినిమా విడుదలకు ముందే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కోసం రామ్ చేసిన కష్టాన్ని అభివర్ణిస్తూ పెట్టిన పోస్ట్ కొత్తరకం స్ట్రాటజీ లో

భాగమైన ప్రమోషన్ అని అంటున్నారు.

రీసెంట్ గానే ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో రామ్ పోతినేని అమ్మాయి మీదే కాదు సినిమాని గాఢంగా ప్రేమించే సినీ ప్రేమికుడిగా కనిపిస్తారు. ఈ టీజర్ చూసిన చాలామంది రామ్ పోతినేని,భాగ్యశ్రీ ల యాక్టింగ్ ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీ రోల్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఉపేంద్రనే ఎందుకు తీసుకున్నారు.. తెలుగు హీరోలు ఎవరూ లేరా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. అలా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకి రెండు మూడు నెలల ముందు నుండే ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. మరి వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందో లేదో తెలియాలి అంటే నవంబర్ 28 వరకు ఎదురు చూడాల్సిందే.