ప్లాన్ మార్చిన రామ్.. 'ఆంధ్ర కింగ్ తాలూకా' కొత్త డేట్!
ఇది రెగ్యులర్ కథ కాదని ముందే క్లారిటీ ఇచ్చారు, "బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్" (ఒక అభిమాని బయోపిక్) అనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తుండటంతో సినీ లవర్స్ లో ఆసక్తి పెరిగింది.
By: M Prashanth | 16 Nov 2025 11:46 PM ISTరామ్ పోతినేని హీరోగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాపై మొదటి నుంచీ మంచి బజ్ ఉంది. ఇది రెగ్యులర్ కథ కాదని ముందే క్లారిటీ ఇచ్చారు, "బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్" (ఒక అభిమాని బయోపిక్) అనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తుండటంతో సినీ లవర్స్ లో ఆసక్తి పెరిగింది. రామ్ అయితే నెవ్వర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
పుష్ప లాంటి బ్లాక్‌బస్టర్లను అందించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే వివేక్ మెర్విన్ అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం అభిమానులు నవంబర్ 28 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్‌లో చిన్న మార్పు చోటుచేసుకుంది.
ప్రేక్షకుల నుంచి వస్తున్న భారీ డిమాండ్, సినిమాపై ఉన్న అంచనాల కారణంగా, మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన నవంబర్ 28కి బదులుగా, ఒక రోజు ముందే.. అంటే నవంబర్ 27నే సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో, రామ్ సరసన డెబ్యూ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని సమాచారం. రామ్‌తో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ చూడని కాన్సెప్ట్ అని చిత్ర బృందం చెబుతోంది.
ప్రమోషన్ల విషయంలో కూడా టీమ్ తగ్గేదేలే అంటోంది. నవంబర్ 18న కర్నూలులో భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇది మొట్టమొదటి భారీ పబ్లిక్ ఈవెంట్ కానుండటం విశేషం. ఈ సినిమాలోని ఓ పాటను రామ్ స్వయంగా రాయడం కూడా హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తుండగా, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టి సిరీస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రం, ఇప్పుడు కొత్త డేట్ అయిన నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది.
