Begin typing your search above and press return to search.

రామ్ సినిమాపై సోషల్ మీడియా ఫీలయ్యే టైమొచ్చింది

ఐతే రామ్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాకు కూడా ఇటీవల ఇలాగే జరిగింది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. అందుకు తగ్గ కమర్షియల్ విజయాన్ని అది అందుకోలేకపోయింది.

By:  Garuda Media   |   20 Dec 2025 5:57 PM IST
రామ్ సినిమాపై సోషల్ మీడియా ఫీలయ్యే టైమొచ్చింది
X

ఒక మంచి సినిమా థియేటర్లలోకి వచ్చినపుడు దానికి సరైన ఆదరణ దక్కకపోతే.. అది ఓటీటీలో రిలీజైనపుడు చూసిన జనాలు చాలా ఫీలవుతుంటారు. ఇంత మంచి సినిమాను థియేటర్లలో హిట్ చేయలేదేంటి అని కామెంట్లు చేస్తుంటారు. TFI Failed here అంటూ ఒక హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తుంటారు. ఈ మధ్య ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ విషయంలోనూ చాలామంది ఇలాగే ఫీలయ్యారు. ఐతే అది మరీ చిన్న సినిమా. రిలీజ్ ముంగిట సరైన ప్రమోషన్ జరగలేదు. అది మంచి సినిమా అని జనాలకు తెలిసేలోగా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది.

ఐతే రామ్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాకు కూడా ఇటీవల ఇలాగే జరిగింది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. అందుకు తగ్గ కమర్షియల్ విజయాన్ని అది అందుకోలేకపోయింది. ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. బ్రేక్ ఈవెన్ కావడానికి 50 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉండగా.. ఫుల్ రన్లో రూ.32 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ కలెక్ట్ చేసిందంతే. ‘అఖండ-2’ వాయిదా పడడం వల్ల ఈ సినిమాకు ఎక్స్ట్రా రన్ వచ్చినా.. రెండో వీకెండ్లో వసూళ్లు మరీ ఎక్కువేమీ రాలేదు. ఆ వీకెండ్ అవ్వగానే సినిమా పనైపోయింది.

ఐతే ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ సినిమా గురించి ఫీలయ్యే టైం దగ్గర పడింది. ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. క్రిస్మస్ కానుకగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ నెల 25న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ను డిజిటల్‌గా రిలీజ్ చేయనుంది. ఈ సినిమా థియేటర్లలో ఉండగానే TFI Failed here హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తే రామ్ అది కరెక్ట్ కాదన్నాడు. ప్రేక్షకులు ఎప్పుడూ ఫెయిల్ కారన్నాడు. నవంబర్ రిలీజ్ దెబ్బ కొట్టిందనే విషయాన్ని ఒప్పుకున్నాడు. అయినా సినిమా థియేటర్లలో ఉండగానే అలా ట్రెండ్ చేయడం కరెక్ట్ కాదని.. ఇంకా కొన్ని రోజులు సినిమా బాగా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ సినిమా చివరికి అనుకున్న ఫలితం రాబట్టలేదన్నది వాస్తవం. మరి ఇప్పుడు డిజిటల్‌గా రిలీజయ్యాక సినిమా గురించి జనం ఎలా స్పందిస్తారో.. ఏం హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తారో చూడాలి.