Begin typing your search above and press return to search.

సెన్సార్ టాక్ వచ్చేసింది.. రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుంచి సినిమా వస్తుందంటే ఆ కిక్కే వేరు. కానీ ఈసారి రామ్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, గుండెల్ని పిండేసే ఎమోషన్ తో వస్తున్నాడు.

By:  M Prashanth   |   25 Nov 2025 4:04 PM IST
సెన్సార్ టాక్ వచ్చేసింది.. రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా?
X

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుంచి సినిమా వస్తుందంటే ఆ కిక్కే వేరు. కానీ ఈసారి రామ్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, గుండెల్ని పిండేసే ఎమోషన్ తో వస్తున్నాడు. పాటలు, ట్రైలర్ తో ఇప్పటికే హైప్ క్రియేట్ చేసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి బయటకు వచ్చిన రిపోర్ట్ చూస్తుంటే, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవడం ఖాయం అనిపిస్తోంది.

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. ఇక రన్ టైమ్ విషయానికి వస్తే, యాడ్స్ లేకుండా సినిమా 2 గంటల 35 నిమిషాల నిడివితో లాక్ చేశారు. మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా పర్ఫెక్ట్ రన్ టైమ్ తో వస్తున్నారు. అయితే అసలు విషయం రన్ టైమ్ లో లేదు, కంటెంట్ లో ఉంది.

సెన్సార్ రిపోర్ట్ ప్రకారం రామ్ పోతినేని వన్ మ్యాన్ షో అని తెలుస్తోంది. ఆయన నటన సినిమాకు ప్రధాన ఆస్తిగా నిలవనుందట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా, కథ చాలా ఫ్రెష్ గా, కొత్తగా ఉందని టాక్. ఒక సినిమా స్టార్ కు, అతని అభిమానికి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ను దర్శకుడు మహేశ్ బాబు పి చాలా ఆర్గానిక్ గా, అద్భుతంగా చూపించారని ప్రశంసిస్తున్నారు.

ముఖ్యంగా సినిమాలోని చివరి 45 నిమిషాలు అదిరిపోతుందని చెబుతున్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారట. ఆ ఎమోషనల్ కోర్ ఆడియన్స్ ను కచ్చితంగా కంటతడి పెట్టిస్తుందని అంటున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని, సినిమాకు ఇవే హైలైట్ గా నిలుస్తాయని స్ట్రాంగ్ గా వినిపిస్తోంది.

ఇక రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయిందట. అలాగే తండ్రి పాత్రలో రావు రమేష్, రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు సినిమాను విజువల్ గా చాలా గ్రాండ్ గా చూపించాయని తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ లోనూ క్వాలిటీ కనిపిస్తోందని సెన్సార్ సభ్యుల నుంచి టాక్ వస్తోంది.

సెన్సార్ టాక్ అయితే పాజిటివ్ గానే కాదు, బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇస్తోంది. రిపోర్ట్స్ పాజిటివ్ గా వస్తుండటంతో అంచనాలు పీక్స్ కు వెళ్లాయి. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ 'ఆంధ్ర కింగ్ తాలూకా', బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఫైనల్ గా రామ్ ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడు.