Begin typing your search above and press return to search.

ఆంధ్ర కింగ్ తాలూకా.. అమెరికా లెక్క ఎలా ఉందంటే..

రామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా' బాక్సాఫీస్ ప్రయాణం నిలకడగా సాగుతోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం స్వదేశంతో పాటు విదేశాల్లోనూ డీసెంట్ వసూళ్లను రాబడుతోంది.

By:  M Prashanth   |   30 Nov 2025 4:24 PM IST
ఆంధ్ర కింగ్ తాలూకా.. అమెరికా లెక్క ఎలా ఉందంటే..
X

రామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా' బాక్సాఫీస్ ప్రయాణం నిలకడగా సాగుతోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం స్వదేశంతో పాటు విదేశాల్లోనూ డీసెంట్ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర రామ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చే నంబర్స్ నమోదవుతున్నాయి. ప్రీమియర్స్ తో పాజిటివ్ స్టార్ట్ అందుకున్న ఈ సినిమా, వీకెండ్ లో కూడా అదే జోరును కంటిన్యూ చేస్తోంది.




లేటెస్ట్ గా అందిన అధికారిక లెక్కల ప్రకారం, నార్త్ అమెరికాలో ఈ సినిమా గ్రాస్ 400K+ డాలర్ల మార్క్ ను దాటిందని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదలైన రెండు, మూడు రోజుల్లోనే ఈ మార్క్ ని చేరుకోవడం విశేషం. ఈ మధ్య సినిమాలకు అమెరికాలో మార్కెట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. గతంలో మాదిరిగా కలెక్షన్స్ రావడం లేదు. కానీ ఈ సినిమాలో ఎమోషన్, ఫ్యాన్ బేస్డ్ కాన్సెప్ట్ ఉండటంతో అక్కడి తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు.

రామ్ గత చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా అక్కడ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. 400K మార్క్ దాటడం అనేది సినిమా లాంగ్ రన్ కు మంచి సంకేతం. ఈ చిత్రంలో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, ప్రత్యాంగిర సినిమాస్ పంపిణీ సినిమా రీచ్ ను పెంచాయి. 'బ్లాక్ బస్టర్ తాలూకా' అనే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం వసూళ్లకు కలిసొస్తోంది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ గమనిస్తే, త్వరలోనే హాఫ్ మిలియన్ మార్క్ ను టచ్ చేసే అవకాశం ఉంది. ఆదివారం కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి, ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి రామ్ ఖాతాలో మంచి నంబర్స్ పడటం ఖాయం. ఒకవేళ ఇదే నిలకడ కొనసాగితే, వన్ మిలియన్ మార్క్ వైపు కూడా అడుగులు వేసే ఛాన్స్ లేకపోలేదు.

రీసెంట్ గానే రామ్ హీరోయిన్ భాగ్యశ్రీతో కలిసి అమెరికాలో సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు. దీంతో రామ్ ఈ సినిమాతో ఓవర్సీస్ లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఎలాంటి హడావుడి లేకుండా, కంటెంట్ ను నమ్మి చేసిన ఈ సినిమా ఆయనకు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఈ నంబర్స్ ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే 'ఆంధ్ర కింగ్' సేఫ్ జోన్ దిశగా వెళ్తున్నాడు.