Begin typing your search above and press return to search.

రామ్ 'మెగా' మూవీ.. ఇంతటి ప్లాన్ ఊహించలేదుగా!

రామ్ కెరీర్‌ లో ఇప్పటివరకు ఎన్నో మాస్, యాక్షన్, కమర్షియల్ చిత్రాలు వచ్చినప్పటికీ,ఆ ప్రాజెక్ట్ మాత్రం వాటన్నింటికీ భిన్నంగా ఉండబోతుందనే ప్రచారం సాగుతోంది.

By:  M Prashanth   |   24 Jun 2026 11:27 PM IST
రామ్ మెగా మూవీ.. ఇంతటి ప్లాన్ ఊహించలేదుగా!
X

టాలీవుడ్‌లో హీరోలు దర్శకులుగా మారడం కొత్త విషయం కాదు. కానీ ఓ స్టార్ హీరో తన కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్‌ తో, పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతుంటే మాత్రం అందరి ఫోకస్ ఆ ప్రాజెక్టుపైనే పడుతుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తి రేకెత్తిస్తోంది రామ్ పోతినేని కొత్త చిత్రం RAPO 23. హీరోగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టి మరో కొత్త ప్రయాణానికి రెడీ అవుతున్నారు.

రామ్ కెరీర్‌ లో ఇప్పటివరకు ఎన్నో మాస్, యాక్షన్, కమర్షియల్ చిత్రాలు వచ్చినప్పటికీ,ఆ ప్రాజెక్ట్ మాత్రం వాటన్నింటికీ భిన్నంగా ఉండబోతుందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా సినిమాను దాదాపు రూ.100 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారనే వార్త హాట్ టాపిక్‌ గా మారింది. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఆ చిత్రం కోసం ఎక్కడా రాజీ పడకుండా ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది.

ఆ సినిమా ప్రత్యేకతల్లో ముందుగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ టీమ్ గురించే. నేషనల్ అవార్డ్ విన్నర్ తిరు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టడం ప్రాజెక్టుకు మరింత బలం చేకూరుస్తోంది. విజువల్‌గా ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మూవీ టీమ్ పని చేస్తోందని సమాచారం. అదే సమయంలో యాక్షన్ ఎపిసోడ్స్‌ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ రంగంలోకి దిగారు.

ఇప్పటికే ఆయన టీమ్ భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమాకు కావాల్సిన గ్రాండియర్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ నిర్మాణం జరుగుతుందని సమాచారం. స్పెషల్ సిటీ బ్యాక్ డ్రాప్ తో రూపొందించే సెట్‌ తో పాటు కీలక యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా మరికొన్ని సెట్లను సిద్ధం చేస్తున్నారట.

దీంతో సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఆ చిత్రం రామ్‌ ను పూర్తిగా కొత్త యాంగిల్ లో చూపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆయన వీర అనే పాత్రలో కనిపించనుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

స్టైలిష్ లుక్‌ తో పాటు పాత్రలోని ఇంటెన్సిటీ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా ద్వారా రామ్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా జోనర్‌ ను పరిచయం చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. కథ విన్నవారు సినిమా కాన్సెప్ట్‌ పై ఎంతో నమ్మకంగా ఉన్నారని, ఇది రామ్ కెరీర్‌ లో గేమ్ ఛేంజర్‌ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా RAPO 23 సాధారణ సినిమా కాదు.. రామ్ కెరీర్‌ ను కొత్త రేంజ్ కు తీసుకెళ్లే ప్రాజెక్ట్‌ గా మారబోతోందని, ఇంతటి ప్లాన్ ఊహించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.