Begin typing your search above and press return to search.

మ్యాడ్ హీరో.. త్రివిక్రం కలిసి వచ్చేలా..?

మ్యాడ్ సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు రామ్ నితిన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో రామ్ నితిన్ తన టాలెంట్ చూపించాడు.

By:  Ramesh Boddu   |   2 Jan 2026 3:49 PM IST
మ్యాడ్ హీరో.. త్రివిక్రం కలిసి వచ్చేలా..?
X

మ్యాడ్ సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు రామ్ నితిన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో రామ్ నితిన్ తన టాలెంట్ చూపించాడు. ఐతే అతను హీరోగా సితార బ్యానర్ లో ఒక సినిమా వస్తుంది. నాగ వంశీ ఈ సినిమాను బలగం కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన కొత్త దర్శకుడితో చేస్తున్నాడట. కథ లాక్ అవ్వగా తెలంగాణా నేపథ్యంలోనే ఈ సినిమా పెళ్లి నేపథ్యంతో ఉంటుందట. అందుకే ఒక మంచి టైటిల్ సెట్ చేశారని తెలుస్తుంది.

త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాకు..

సితార ఎంటర్టైన్ మెంట్స్ రీసెంట్ గానే ఫిల్మ్ ఛాంబర్ లో బంధుమిత్రుల అభినందనలతో టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఐతే నాగ వంశీ టైటిల్ రిజిస్టర్ అనగానే అది త్రివిక్రం వెంకటేష్ సినిమాకు పెడుతున్న టైటిల్ అనుకున్నారు. ఐతే ఆ సినిమాకు ఆదర్శ కుటుంబం అని పెట్టారు. అందుకే బంధుమిత్రుల అభినందనలతో టైటిల్ ఈ మూవీకి పెడుతున్నారట.

ఐతే త్రివిక్రమ్ సలహా మేరకే ఈ టైటిల్ పెట్టి ఉండొచ్చనే టాక్ నడుస్తుంది. మ్యాడ్ హీరో రాం నితిన్ కి ఈ సినిమా ఒక మంచి పుష్ ఇచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సితార బ్యానర్ లో సినిమాలకు టైటిల్ విషయంలో త్రివిక్రమ్ హెల్ప్ ఉంటుంది. సితార తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ బ్యానర్ లో త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతున్నారు. అందుకే గురూజీ ఆ సినిమాలకు టైటిల్స్ ఇంకా చిన్న చిన్న మార్పులు సూచిస్తున్నారు.

రామ్ నితిన్ సినిమాకు గురూజీ టైటిల్..

మొత్తానికి రామ్ నితిన్ సినిమాకు గురూజీ టైటిల్ పెట్టడం తో సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది. తప్పకుండా ఈ సినిమా అతని కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. రామ్ నితిన్ ఈ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో కూడా రాబోతున్నారని తెలుస్తుంది. సితార నాగ వంశీ కూడా ఓ పక్క స్టార్ సినిమాలతో ప్లాటు యువ హీరోలతో కూడా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాకు ఆదర్శ కుటుంబం టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కూడా కంప్లీట్ వెంకీ మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. వెంకటేష్ సినిమా పూర్తి చేశాక త్రివిక్రం అల్లు అర్జున్ తో మైథాలజీ మూవీ ప్లానింగ్ చేస్తున్నారు. వెంకటేష్ సినిమాను ఈ సమ్మర్ రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉంది.

సితార బ్యానర్ కి 2025 పెద్దగా కలిసి రాలేదు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా డిజప్పాయింట్ చేశాయని తన సినిమాల గురించి నాగ వంశీ చెప్పారు. ఐతే ఈ ఇయర్ మాత్రం కచ్చితంగా ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలతో వస్తామని అన్నారు. సంక్రాంతికి సితార బ్యార్ నుంచి నవీన్ పొలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు సినిమా వస్తుంది.