Begin typing your search above and press return to search.

రామ్‌ మూవీ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

రామ్‌ స్వీయ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

By:  Ramesh Palla   |   11 July 2026 7:00 PM IST
రామ్‌ మూవీ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌
X

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హిట్‌ కోసం పరితపిస్తున్నాడు. గత చిత్రం ఆంధ్రా కింగ్‌ తాలూక సినిమాపై రామ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. రామ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతా బాగానే ఉందని టాక్‌ వచ్చినా వసూళ్లు మాత్రం ఆశించిన విధంగా రాలేదు అనేది టాక్‌. ఆ విషయం గురించి రామ్‌ సైతం సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశాడు అనేది గతంలో వచ్చిన టాక్‌. ఆ విషయం పక్కన పెడితే రామ్‌ ప్రస్తుతం ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. సాధారణంగా యంగ్‌ హీరోలు దర్శకత్వంపై ఆసక్తి ఉన్నప్పటికీ కెరీర్‌ పీక్స్‌లో ఉన్న కారణంగా ఆ ఆలోచన పక్కన పెడతారు, ఆ అభిరుచిని తొక్కి పట్టి ఉంచుతారు. కానీ రామ్‌ మాత్రం దర్శకత్వం చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే స్వీయ దర్శకత్వంలో హీరోగా సినిమాను మొదలు పెట్టాడు.

రామ్‌ దర్శకత్వంలో కొత్త సినిమా...

అతి కొద్ది మంది యంగ్‌ హీరోలు మాత్రమే దర్శకత్వం చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. వారిలో ఎక్కువ శాతం మంది మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రామ్‌ సైతం ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇప్పటి వరకు రామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కొన్ని రోజుల క్రితం షూటింగ్‌ ప్రారంభం అయ్యిందనే వార్తలు వచ్చాయి. షూటింగ్‌ అప్‌డేట్‌ కూడా ఏమీ లేదు. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎవరు ఎంపిక అయ్యారు అనే విషయంలో స్పష్టత లేదు. ఆ మధ్య ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ ఆ హీరోయిన్స్‌ ను ఎంపిక చేయలేదట. కొత్తగా సంయుక్త మీనన్‌ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. అతి త్వరలోనే రామ్‌ తో కలిసి సినిమా షూటింగ్‌లో సంయుక్త పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రా కింగ్‌ తాలూక సినిమా తర్వాత...

రామ్‌ స్వీయ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. దాదాపుగా మూడు నెలల పాటు రామ్‌ ఈ స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేశాడట. అంతే కాకుండా ఈ కథను చాలా కాలంగా రామ్‌ డెవలప్‌ చేస్తూ వస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని రామ్‌ భావిస్తున్నాడట. 2021 నుంచి ప్రతి ఏడాది రామ్ నటించిన సినిమా విడుదల అవుతూ వస్తోంది. గత ఏడాది ఆంధ్రా కింగ్‌ తాలూక, అంతకు ముందు అంటే 2024లో డబుల్‌ ఇస్మార్ట్‌, 2023లో స్కంద, 2022లో ది వారియర్‌ సినిమాలతో రామ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది కూడా మిస్ కాకుండా తన సినిమా ఉండాలని రామ్‌ భావిస్తున్నాడట. అందుకే షూటింగ్‌ చాలా స్పీడ్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో రామ్‌ మూవీ ఈ ఏడాది చివర్లో...

2026 నవంబర్‌ లేదా డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను రామ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా రామ్‌ రూపొందిస్తున్న ఈ సినిమా కథ ఏంటి, ఇతర వివరాలు అన్ని త్వరలోనే రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమా నేటివిటీ విషయంలో అంతా ఆసక్తిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పీరియాడిక్ సినిమాలకు మంచి స్పందన వస్తుంది. కనుక రామ్‌ కూడా ఈ సినిమాలో పీరియాడిక్‌ ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అతి త్వరలోనే సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకట్టుకునే కథ, కథనంతో రామ్‌ రూపొందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి అంటే ఈ ఏడాది చివరి వరకు వెయిట్‌ చేయాల్సిందే.