Begin typing your search above and press return to search.

నాని 'జడలు'.. అసలు కష్టం వాళ్లకే..

నాని లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ జడలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. దట్టమైన గడ్డం, వంకర మీసం, రెండు పొడవాటి జడలు.. మొత్తంగా నాని ఇంతకుముందెన్నడూ కనిపించని రగ్గడ్ మాస్ అవతార్‌ లో కనిపిస్తున్నారు.

By:  M Prashanth   |   14 Sept 2026 7:00 AM IST
నాని జడలు.. అసలు కష్టం వాళ్లకే..
X

సినిమా కోసం హీరోలు లుక్ మార్చుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఆ లుక్ కోసం ఇబ్బందులు పడడం అంటే మాత్రం మాటలు కాదు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని విషయంలో అదే జరుగుతోంది. ది ప్యారడైజ్ లో రెండు పొడవాటి జడలతో కనిపించనున్న నాని.. ఆ జడలతో యాక్షన్ చేయడానికి ఎంత కష్టపడ్డారో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నాని లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ జడలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. దట్టమైన గడ్డం, వంకర మీసం, రెండు పొడవాటి జడలు.. మొత్తంగా నాని ఇంతకుముందెన్నడూ కనిపించని రగ్గడ్ మాస్ అవతార్‌ లో కనిపిస్తున్నారు. అయితే ఆ లుక్ సిల్వర్ స్క్రీన్ పై ఎంత పవర్‌ ఫుల్‌ గా కనిపిస్తుందో.. దాని వెనుక అంతే కష్టం ఉందట. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌ లో నానికి జడలు పెద్ద సవాలుగా మారాయని రామ్-లక్ష్మణ్ తెలిపారు.

తలపై ఎక్స్ ట్రా వెయిట్ తో యాక్షన్ చేయాల్సి రావడం మామూలు విషయం కాదన్నారు. ముఖ్యంగా జడలు పెట్టుకున్న వాళ్లకు ఆ కష్టం ఏంటో బాగా అర్థమవుతుందని చెప్పారు. నెత్తిపై బరువు పెట్టుకుని ఫైట్స్ చేయడం అంత ఈజీ కాదని వివరించారు. ఇదే విషయాన్ని డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ గతంలో చెప్పారు. జడలు బరువుగా ఉండటంతో వాటితో డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు.

నాని కూడా జడలతో యాక్షన్ చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన వివరించారు. దీంతో జడల బరువుపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే ఇక్కడే నాని అసలు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగా జడలు 6 నుంచి 10 కిలోల బరువు లేవని చెప్పారు. యాక్షన్ సీన్స్‌ లో రోప్ వర్క్ చేస్తున్న సమయంలో జడలు ఇరుక్కోవడంతో తలపై గాయాలయ్యాయని తెలిపారు. తన కష్టం చూసి సందీప్ మాస్టర్ ఎమోషనల్ అయి అలా చెప్పారే తప్ప.. జడలు అంత బరువు కాదని నాని స్పష్టం చేశారు.

అంటే అసలు పాయింట్ జడల బరువు ఎంత అనేది కాదు.. వాటిని పెట్టుకుని యాక్షన్ చేయడం ఎంత కష్టమన్నదే. ముఖ్యంగా రోప్ వర్క్, ఫైట్స్ సమయంలో జడలు ఇరుక్కోకుండా చూసుకుంటూ యాక్షన్ చేయాల్సి రావడం నానికి పెద్ద టాస్క్‌ గా మారింది. అయినా లుక్ విషయంలో ఎక్కడా తగ్గకుండా.. యాక్షన్ విషయంలోనూ చాలా కష్టపడ్డారన్నమాట. ఇక ప్యారడైజ్ యాక్షన్ గురించి రామ్-లక్ష్మణ్ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

నాని కెరీర్‌ లోనే ఇది భారీ యాక్షన్ సినిమా అని, దసరాతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ ఉంటుందని వారు చెబుతున్నారు. అందుకే ఈసారి నాని జడలు కేవలం లుక్ కోసం కాదు.. యాక్షన్‌ లో స్పెషల్ గా కనిపించబోతున్నాయి. స్క్రీన్ పై ఆ రెండు జడలు చేసే మాస్ హంగామా ఎలా ఉంటుందో చూడాలంటే సెప్టెంబర్ 24 వరకు వెయిట్ చేయాల్సిందే.