పెళ్లికి ముందు ప్లేబోయ్ ..పెళ్లి తర్వాత అన్నీ కట్!
అప్పట్లో తాను జీవితాన్ని చాలా సరదాగా గడిపేవాడినని, ఏ విధమైన బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా ఉండటాన్ని ఇష్టపడేవాడినని వివరించారు.
By: Srikanth Kontham | 7 July 2026 4:00 PM ISTబాలీవుడ్ నటుడు రామ్ కపూర్ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వివాహానికి ముందు తాను ఒక ప్లేబాయ్ గా ఉండేవానని.. తన జీవితంలో ఎంతో మందితో సంబంధాలను కలిగి ఉన్నానని పేర్కొనడం గమనార్హం. చాలా కాలం పాటు స్వేచ్ఛాజీవిగా గడిపిన రామ్ కపూర్ అప్పట్లో ఏ ఒక్క వ్యక్తితో కూడా సీరియస్ బంధం కొనసాగించలేదన్నారు. తాను గడిపిన ఆ గతాన్ని గురించి రామ్ కపూర్ ఎప్పుడూ దాచుకోలేదు. తన జీవితంలో తాను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఉండేవానని ఆ సమయంలో అనేకమందితో డేటింగ్ చేశానని గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో తాను జీవితాన్ని చాలా సరదాగా గడిపేవాడినని, ఏ విధమైన బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా ఉండటాన్ని ఇష్టపడేవాడినని వివరించారు. అయితే భార్య గౌతమి కపూర్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత రామ్ కపూర్ జీవితం పూర్తిగా మారిపోయింది. మొదట రామ్ గతం గురించి తెలుసుకున్న గౌతమి తనతో బంధాన్ని కొనసాగించడం విషయంలో కొంచెం ఆలోచించాల్సి వచ్చిందని ఆయనే వెల్లడించారు. ఎందుకంటే? అంతకుముందు తనకున్న ప్లేబాయ్ ఇమేజ్ వల్ల గౌతమికి తనపై పూర్తి నమ్మకం కలగడానికి కాస్త సమయం పట్టిందన్నారు.
ఈ సందర్భంలోనే నిర్మాత ఏక్తా కపూర్ ప్రస్తావన వచ్చింది. రామ్ కపూర్ - గౌతమిల బంధం మొదలైనప్పుడు ఏక్తా కపూర్ స్వయంగా గౌతమిని హెచ్చరించారట. రామ్ కపూర్ గతం గురించి తెలిసి గౌతమికి ముందే అవగాహన కల్పించాలని ఏక్తా భావించిందిట. రామ్ కపూర్‌తో గౌతమి బంధం ఎంతవరకు సబబు అనేది ఏక్తా కపూర్‌కు ఆందోళన కలిగించిందని తెలుస్తోంది. అయితే ఏక్తా కపూర్ చేసిన ఆ హెచ్చరికలను గౌతమి లెక్కచేయలేదని రామ్ కపూర్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏక్తా కపూర్ చేసిన ఆనాటి హెచ్చరికలు, గౌతమిని కన్ఫ్యూజ్ చేసినప్పటికీ వారిద్దరి మధ్య ఉన్న బలమైన అనుబంధం అన్ని సందేహాలను అధిగమించిందని తాజాగా రామ్ కపూర్ పేర్కొన్నారు.
నేడు రామ్ కపూర్ - గౌతమి కపూర్ అన్యోన్య దంపతులుగా, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. గతాన్ని అంగీకరించిన గౌతమిని తన జీవిత భాగస్వామిగా దక్కించుకోవడం తన అదృష్టమని రామ్ కపూర్ ఎప్పుడూ చెబుతుంటారు. గతం ఎలా ఉన్నా? వర్తమానంలో ఒకరిపై ఒకరు ఉంచుకున్న నమ్మకమే వారి వైవాహిక జీవితాన్ని విజయవంతం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రామ్ కపూర్ నటుడిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తున్నారు. అప్పుడప్పుడు రియాల్టీ షోలలోనూ కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
