ఎనర్జిటిక్ స్టార్ రామ్ షార్ట్ ఫిల్మ్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `దేవదాస్` తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.
By: Srikanth Kontham | 17 Nov 2025 4:00 AM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `దేవదాస్` తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఎనర్జిటిక్ పెర్పార్మెన్స్ తో ఎన్నో చిత్రాల్లో అలరించాడు. మరి రామ్ ఎంట్రీకి ముందు చేసిన కసరత్తులు ఏంటి? ఆరంభంలో నటుడిగా అతడు ఎలా ఫీలయ్యాడు? అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. రామ్ కూడా యూట్యూబ్ నుంచి తెరంగేట్రం చేసిన నటుడని తేలింది. యూ ట్యూబ్ అంటే పెద్దగా ప్రాచుర్యంలోకి రాని రోజుల్లోనే తాను యూ ట్యూబ్ లో లఘు చిత్రం చేసినట్లు తెలిపాడు.
ఆ షార్ట్ ఫిలిం యూరప్ ఫిలిం పెస్టివల్స్ లో కూడా ప్రదర్శితమైందన్నాడు. అందులో తన పెర్పార్మెన్స్ కు గాను అవార్డు కూడా వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం చూసే చాలా మంది వెండి తెరకు పరిచయం చేస్తామని పోటీ పడినట్లు తెలిపాడు. అయితే నటుడిగా తాను తెలుగులో ఎంటర్ అవ్వకముందే తమిళ్ లోనే లాంచ్ అవ్వాలనుకున్నాడుట. అక్కడ సక్సెస్ అయిన తర్వాత తెలుగు సినిమాలు చేయాలనుకున్నాడుట. కానీ వైవిఎస్ చౌదరి పదే పదే ఇంటికొచ్చి వెంట పడటంతో దేవదాసు సినిమాకు అంగీకరించినట్లు తెలిపాడు.
అప్పుడు గనుక చౌదరి అంత పోర్స్ చేయకపోతే తమిళ్ లోనే తన డెబ్యూ ఉండేదన్నాడు. అప్పుడు రామ్ వయసు 15 ఏళ్లు. తన జీవితం కూడా సినిమా లైఫ్ లాగే ఉండాలని అనుకునేవాడుట. అలా అనుకోవడం తనకు ఎంతగానో కలిసొచ్చిందన్నాడు. వ్యాయామం దగ్గర నుంచి ప్రతీది డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటానన్నాడు. సినిమా అనేది తన జీవితంలో తీసుకొచ్చిన గొప్ప మార్పుగా చెప్పుకొచ్చాడు. కార్లు కొనడంలో...ఫోన్లు వాడటంలో కూడా తాను అంతే స్పెషల్ గా ఉంటానన్నాడు. రోజుకొక కారులో బయటకు వెళ్తానన్నాడు. ఫోన్ కూడా రకరకాల మోడల్స్ వాడుతుంటానన్నాడు.
ఎప్పుడు ఏ నెంబర్ వాడతానో? తనకే తెలియదన్నాడు. తరుచూ ఫోన్లు మార్చడం వలన వస్తోన్న ఇబ్బంది అది అని తెలిపాడు. మొత్తానికి రామ్ అసలైన గోల్డ్ స్పూన్ కిడ్ అని నిరూపించాడు. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలను అడిగితే తమ జీవితం చాలా సింపుల్ గా ఉంటుందని చెబుతారు. గతంలో రామ్ చరణ్ కూడా సాధారణలైఫ్ అంటేనే తనకిష్టం అన్నాడు. అలాగే మహేష్ కూడా చాలా సింపుల్ గా ఉంటాడు. ప్రత్యేకించి లగ్జరీ కారులోనే వెళ్లాలి అనే నిబంధన ఏదీ ఉండదు. అప్పటికప్పుడు ఏ కారు అందుబాటులో ఉంటే దాన్ని వినియోగిస్తారు.
