RGV లోని క్వాలిటీస్ వేరే యువకుడిలో చూడలేనన్న మాజీ భార్య!
తన భార్యతో మనస్పర్థలు, గొడవలు ఉన్నా.. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నా భార్య పట్ల ఆర్జీవీ ఎప్పుడూ అత్యంత గౌరవంగా ప్రవర్తించేవారని సోదరి విజయలక్ష్మి తెలిపారు.
By: Sivaji Kontham | 16 Sept 2026 9:26 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) వ్యక్తిగత జీవితం- స్వభావం గురించి ఆయన సోదరి విజయలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆర్జీవీతో తనకున్న సోదర అనుబంధం, అతడిలోని ప్రత్యేకమైన లక్షణాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు.
తన భార్యతో మనస్పర్థలు, గొడవలు ఉన్నా.. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నా భార్య పట్ల ఆర్జీవీ ఎప్పుడూ అత్యంత గౌరవంగా ప్రవర్తించేవారని సోదరి విజయలక్ష్మి తెలిపారు. సాధారణంగా మగవారిలో ఉండే కొన్ని సహజమైన ఇబ్బందికరమైన లేదా భరించలేని గుణాలు రామ్ గోపాల్ వర్మలో అసలు ఉండవని ఆర్జీవీ భార్య రత్న తనతో అంటుండేవారని తెలిపారు.
ఒకవేళ తాను వేరే అబ్బాయిని తన జీవితంలోకి తీసుకువస్తే ఆ క్వాలిటీస్ కచ్చితంగా ఉండవని.. అసలు తనకు వేరొకరు తోడుగా రావాలనే ఆలోచన లేదా ఆ ఫీలింగ్ ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదని ఆర్జీవీ భార్య చెప్పారట. కేవలం రాములోని ఆ ప్రత్యేకమైన వ్యక్తిత్వమే తనను మరో ఆలోచన చేయనివ్వలేదని రత్నం వెల్లడించారని విజయలక్ష్మి తెలిపారు.
అంతేకాకుండా.. రాము కూడా ఎప్పుడూ మరో పెళ్లి చేసుకోమని భార్యను బలవంతం చేయలేదని.. ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను.. వారి ఇష్టాలను ఆయన గౌరవిస్తారని విజయలక్ష్మి తెలిపారు. వివాహ బంధాల విషయంలో ఆర్జీవీకి ఒక స్పష్టమైన అభిప్రాయం.. క్లారిటీ ఉందని..ఆయన ఎప్పుడూ గందరగోళానికి గురికాకుండా చాలా స్పష్టంగా ఆలోచిస్తారని సోదరి ప్రశంసించారు.
ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ కేవలం సినిమాల పరంగానే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో కూడా తనకంటూ కొన్ని కచ్చితమైన సిద్ధాంతాలు.. పద్ధతులు కలిగిన వ్యక్తి అని ఆయన సోదరి విజయలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆ విశేషాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
