మూవీ రివ్యూస్, పబ్లిక్ టాక్స్.. ఆర్జీవీ ఒపీనియన్ ఏంటి?
ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిగా కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని, ఒకసారి టికెట్ కొన్న చేసిన తర్వాత సినిమా ఫ్యూచర్ నిర్ణయించే రైట్ ప్రేక్షకులకే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
By: M Prashanth | 9 Jun 2026 12:53 PM ISTటాలీవుడ్ లో సినిమా రివ్యూలు, యూట్యూబ్ పబ్లిక్ టాక్ వీడియోలపై కొనసాగుతున్న చర్చ వేళ.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రెస్పాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమా విడుదలైన తొలి రోజే థియేటర్ల వద్ద ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతోందంటూ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, రివ్యూలను అడ్డుకోవడం సరైన విధానం కాదని ఆయన చెప్పడం గమనార్హం.
సినిమా చూసిన తర్వాత తన ఒపీనియన్ చెప్పే హక్కు ప్రతి ప్రేక్షకుడికి ఉందని ఆర్జీవీ అన్నారు. సోషల్ మీడియా జెనరేషన్ లో రెస్పాండ్ అయ్యే ఫ్రీడమ్ ను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని, రివ్యూలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ అవ్వవని తెలిపారు. అయితే రివ్యూల అంశాన్ని ఆయన వర్షంతో పోల్చడం ఆసక్తికరంగా మారింది.
"వర్షం పడితే తడవాల్సిందే. ఇంట్లో ఉండాలా, బయటకు వెళ్లాలా, రెయిన్ కోట్ వేసుకోవాలా అనేది మన ఇష్టం. కానీ వర్షం పడుతోందని దానిపై కోప్పడడం వల్ల యూజ్ ఉండదు" అంటూ మాట్లాడారు. సమాజంలో ఫోన్లు, రెస్టారెంట్లు, స్పోర్ట్స్, పాలిటిక్స్.. ఇలా ప్రతిదానిపై రివ్యూలు ఉంటాయని, సినిమాలకు వద్దని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు.
సినిమా విడుదలైన తొలి మూడు రోజులు రివ్యూలను కంట్రోల్ చేయాలనే ఆలోచన వెనుక బిజినెస్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. మొదటి వీకెండ్ లో ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి డబ్బులు తిరిగి తెచ్చుకోవాలనే ఆలోచనతో కొందరు నిర్మాతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రేక్షకులకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ చేరకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు.
యూట్యూబ్ రివ్యూవర్లు, మూవీ ఎక్స్పర్ట్స్ పై వస్తున్న విమర్శలను కూడా ఆయన ఖండించారు. "సినిమా ఇండస్ట్రీ కష్టాన్ని ఉపయోగించుకుని వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు" అనే కామెంట్స్ ను తప్పుబట్టారు. రివ్యూవర్లు ఇండస్ట్రీకి కాకుండా ఆడియన్స్ కు సంబంధించినవారని, వారి బాధ్యత ప్రేక్షకులకు సరైన ఇన్ఫో అందించడమేనని చెప్పారు. ఒక సినిమా క్వాలిటీ లేకుండా ఉంటే దానిపై నిజాయితీగా అభిప్రాయం చెప్పడం ద్వారా ప్రేక్షకుల మనీ, టైమ్ ఆదా చేస్తున్నారని ఆర్జీవీ అన్నారు.
ఆ యాంగిల్ లో చూస్తే రివ్యూవర్లు ఒక రకంగా సోషల్ సర్వీస్ చేస్తున్నట్టేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్ టికెట్ ధరలు, ఫుడ్ ఐటమ్స్ ఖర్చులు సాధారణ ప్రేక్షకుడికి భారం అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సినిమాకు వెళ్లాలి, ఏ సినిమాను దూరంగా ఉంచాలనే విషయంలో రివ్యూలు హెల్ప్ అవుతాయని అన్నారు. రివ్యూలను అడ్డుకునేందుకు కాపీరైట్ స్ట్రైక్స్ లేదా ఇతర ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల సమస్య సాల్వ్ కాదని ఆర్జీవీ అన్నారు.
ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిగా కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని, ఒకసారి టికెట్ కొన్న చేసిన తర్వాత సినిమా ఫ్యూచర్ నిర్ణయించే రైట్ ప్రేక్షకులకే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ లో నిర్మాతలు, యూట్యూబ్ రివ్యూవర్ల మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో ఆర్జీవీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మంచి కంటెంట్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలే తప్ప, రివ్యూలను నిందించడం సమస్యకు సొల్యూషన్ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
